జైల్లో విగ్గు తీసేసి గుండు గీయించాడా?

అయితే నెల రోజులుగా జైల్లో ఉండ‌టంతో విగ్గు మెయింటైన్ క‌ష్టంగా మారిందిట‌. దీంతో విగ్గు తీసేసి హెడ్ మొత్తం క్లీన్ షేవ్ చేయించిన‌ట్లు స‌మాచారం.

Update: 2024-07-16 12:29 GMT

రేణుకాస్వామి హ‌త్య కేసులో అరెస్ట్ అయిన న‌టుడు ద‌ర్శ‌న్ జైలుకెళ్లి నెల రోజులు దాటింది. ఈ కేసులో పోలీసులు ఇంకా మ‌రిన్ని సాక్ష్యాలతో కొత్త పిటీష‌న్లు వేస్తున్నారు. గురువారంతో ద‌ర్శ‌న్ క‌స్ట‌డీ ముగుస్తుంది. ఈసారి పోలీస్ కస్ట‌డీ కోరే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. మ‌రోవైపు బెయిల్ కోసం ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌ల‌క్ష్మి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే కేసు లో బ‌ల‌మైన సాక్ష్యాలు దొర‌క‌డంతో ద‌ర్శ‌న్ శిక్ష నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది.

అయితే విచార‌ణ‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఈలోపు ద‌ర్శ‌న్ కోర్టులు చుట్టూ..పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిర‌గాల్సిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సినిమాల‌న్నీ ఆగిపోతున్నాయి. హ‌త్యకు ముందు ద‌ర్శ‌న్ 'డెవిల్' అనే సినిమా మొద‌లు పెట్టాడు. ఆ వెంట‌నే ఆరెస్ట్ అయ్యాడు. దీంతో సినిమా ఆగిపోయింది. అలాగే రీ-రిలీజ్ అయిన 'శాస్త్రి' అనే సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమా నుంచే ద‌ర్శ‌న్ విగ్గు మెయింటెన్ చేస్తున్నాడు.

కానీ ఇది చాలా మందికి తెలియ‌దు. అత‌డిది ఒరిజిన‌ల్ హెయిర్ అనుకుంటున్నారు. అయితే ఆరేళ్ల నుంచి విగ్గును ఎక్కువ‌గా వాడుతున్నారు. ఆ త‌ర్వాత కాలంలో అది విగ్గు అని అంద‌రికీ అర్ద‌మైంది. సినిమాల‌తో పాటు, బ‌య‌ట కూడా అదే హెయిర్ స్టైల్ తో క‌నిపించడంతో సంగ‌తి అర్దమైంది. అయితే నెల రోజులుగా జైల్లో ఉండ‌టంతో విగ్గు మెయింటైన్ క‌ష్టంగా మారిందిట‌. దీంతో విగ్గు తీసేసి హెడ్ మొత్తం క్లీన్ షేవ్ చేయించిన‌ట్లు స‌మాచారం.

ఇక ద‌ర్శ‌న్ అరెస్ట్ విష‌యంలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. పేరున్న న‌టు లంతా ద‌ర్శ‌న్ తప్పు చేసి ఉండ‌డ‌ని భావిస్తున్నారు. అలాగే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగానూ కొన్ని అభి ప్రాయాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఏది ఏమైనా ద‌ర్శ‌న్ ఇప్పుడు అత్యంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు.

Tags:    

Similar News