దాసరి కల చిరంజీవి నెరవేర్చేనా?
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ అన్న సంగతి తె లిసిందే.
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. ఆ రకంగా తెలుగు సినిమాకే బన్నీ ఓ గర్వంగా నిలిచారు. తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది గొప్ప నటులున్నా ఏ ఒక్కరికీ అవకాశం రాలేదు. తొలిసారి తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఘనత ఐకాన్ స్టార్ సొంతమే. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గతంలో జాతీయ అవార్డు గురించి చిరంజీవి- దర్శకరత్న దాసరి రారాయణరావు మధ్య జరిగిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
చిరంజీవి నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లో నేరుగా దాసరి ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంలో గొప్ప నటుడివి.. ఏ స్టార్ పొందనంత స్టార్ డమ్ పొందావు..నువ్వు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తీసుకుంటే చూడాలని ఉంది అన్న మనసులో కోర్కెను దాసరి బయట పెట్టారు. దీనికి చిరంజీవి ఎంతో సింపుల్ గా సమాధానం ఇచ్చారు. అవార్డులు..రివార్డులు పొందాలనే తపన నాలో ఉండదు.
ఆ ఆలోచనే నాకెప్పుడు రాదు. అవార్డు అనేది దానంతట అదే రావాలి. అలా వస్తే ఆనందం, గర్వంగా ఉంటుంది. అవార్డుల కోసం ప్రత్యేకమైన సినిమాలు చేయాలనే ఆలోచనలేదు. అవార్డుల కంటే విలువైన ప్రజాభిమానాన్ని సంపాదించుకోవాలని, దాన్ని నిలబెట్టు కోవాలని మాత్రమే ఉంటుంది. ఎల్లవేళ్లలా నా మనసును తొలిచే ఆలోచన అదే. మీలాంటి పెద్దలు కోరుకున్నందుకైనా ఏదో ఒక నాటికి నెర వేరుతుందేమో చూద్దాం` అన్నారు. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది.
చిరంజీవి లాంటి నటుడికి ఇంతకాలం జాతీయ అవార్డు రాకపోవడ ఏంటి? అభిమానులంతా అనుకుంటు న్నారు. చిరంజీవి అవార్డు విన్నింగ్ మూవీలు కెరీర్ ఆరంభంలోనే చేసారు. తర్వాత కాలంలో కమర్శియల్ చిత్రాల మోజులో పడి ఆతరహా కాన్సెప్ట్ ల జోలికి వెళ్లలేదు. ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. చిరంజీవి సినిమాలంటే పక్కా కమర్శియల్ యాస్పెక్ట్ లోనే ఉంటాయి.`సైరా నరసింహారెడ్డి` సినిమాతో నటుడిగా ఓకొత్త ప్రయోగాం చేసిన సంగతి తెలిసిందే.