బ్లింక్ మూవీ ఎలా ఉంది..?
కన్నడలో ఆల్రెడీ రిలీజై ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన బ్లింక్ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
దసరా సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి తెలుగులో మరో ప్రయత్నం చేయలేదు కానీ కన్నడలో మాత్రం అతను వరుస సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా అతను లీడ్ రోల్ లో శ్రీనిధి బెంగళూరు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా బ్లింక్. కన్నడలో ఆల్రెడీ రిలీజై ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన బ్లింక్ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ బ్లింక్ కథ ఏంటి.. ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.
అపూర్వ (దీక్షిత్ శెట్టి) ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి.. చిన్న జాబ్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. ఐతే అతని లైఫ్ లోకి స్వప్న (మందార బత్తల హళ్లి) వస్తుంది. ఇద్దరికీ థియేటర్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండటంతో ఇద్దరు కలిసి నాటికలు ప్రదర్శిస్తారు. అపూర్వకు స్వప్న అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉంటుంది. ఐతే ఒకరోజు అపూర్వకు ఒక వ్యక్తి తారసపడి కళ్లార్పకుండా ఎక్కువ సేపు ఉండే శక్తి నీకు ఉంది. అలా చెప్పినట్టు చేస్తే నిన్ను గతంలోకి తీసుకెళ్తా.. నీ తండ్రి వివరాలు చెబుతా అని అంటాడు. అపూర్వ దీన్ని ఫస్ట్ వాటిని నమ్మకపోయినా ఆ తర్వాత నమ్మాల్సి వతుంది. టైం ట్రావెల్ లో కాలంలో ప్రయాణించిన అపూర్వకు ఎలాంటి విషయాలు తెలిసాయి. అపూర్వ తండ్రి అతను అనుకున్నట్టుగా బ్రతికే ఉన్నాడా..? అపూర్వ తిరిగి ప్రెజెంట్ కి వచ్చాడా అది ఎలా జరిగింది అన్నది బ్లింక్ కథ.
ఈమధ్య కాలంలో టైం ట్రావెల్ కథలు ఆ బేస్ మీద అల్లుకున్న సినిమాలు చాలా వచ్చాయి. ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడికి కొత్తేమి కాదు. ఐతే బ్లింక్ మాత్రం ఇప్పటివరకు వచ్చిన టైం ట్రావెల్ సినిమాలకు కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. అపూర్వ లైఫ్ గురించి చెప్పుకుంటూ సినిమా మొదలు పెటిన డైరెక్టర్ అతను టైం ట్రావెల్ చేయడానికి సిద్ధమైన తర్వాతే ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఇక సినిమాలో 1996 లో చూపించిన ప్రేమ పెళ్లి సీన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.
సినిమా కథ చాలా కాంప్లికేటెడ్ గా రాసుకున్న డైరెక్టర్ శ్రీనిధి దాన్ని తెర మీద చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. భ్రమ, వాస్తవానికి తేడా.. అలాంటి మనుషుల మానసిక వేదన ఆడియన్ ఫీల్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బ్లింక్ సినిమా మొత్తం ఒక ఎత్తైతే లాస్ట్ హాఫ్ ఆన్ అవర్ ఒక ఎత్తు. ఈ సినిమాను రెప్పపాటు కూడా మిస్ అవ్వకూడని స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ఇంప్రెస్ చేశాడు. దీక్షి శెట్టి తప్ప మిగతా నటులంతా తెలుగు వారికి తెలియదు. అయినా డైరెక్టర్ వాళ్లను ఆ డౌట్ రాకుండా పాత్రల్లో మెప్పించేలా చేశాడు.
ఇలాంటి సినిమాలన్నీ కూడా సినిమాను ఆడియన్ కనెక్ట్ అయిన దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. బ్లింక్ సినిమా కూడా సినిమాకు కనెక్ట్ అయితే ప్రతిదీ ఆశ్చర్యకరంగా ఇంప్రెస్ చేస్తుంది. సినిమాను ఓన్ చేసుకోలేకపోతే మాత్రం నిరాశ తప్పదు. సినిమా ఆన్ స్క్రీన్ నటీనటులే కాదు, టెక్నికల్ గా కూడా తగినట్టుగా పనిచేశారనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్ సినిమా చూడాలి అనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లింక్ వీకెండ్ ఎంటర్టైన్ చేస్తుంది.