డిశ్చార్జ్ అయిన దీపిక పదుకొణే!
ప్రసవం నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఇటీవల ముంబై రిలయన్స్ పౌండేషన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
ప్రసవం నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే ఇటీవల ముంబై రిలయన్స్ పౌండేషన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. తాజాగా దీపిక నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. మీడియా కెమెరాలకు తావు ఇవ్వకుండా దీపిక..రణవీర్ సింగ్ లను ఆసుపత్రి వెనుక గేట్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. అయినా వాళ్లిద్దరు బయటకు వస్తోన్న వీడియోలు లీక్ అయ్యాయి.
పాపాయిని కెమెరాలు ప్రోజెక్ట్ చేసే ప్రయత్నం చేసాయి. భద్రతా ఇబ్బంది ఎదురవుతుందనే ఆసుపత్రి యాజమాన్యం ఇలా వెనుక గేట్ నుంచి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలలు పాటు దీపిక ఇంటికే పరిమితమవుతుంది. పాపాయి సంరక్షణ ..తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ..రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ చెకప్ లతో ఆమె సమయాన్ని గడపనున్నారు.
మరి పాపాయిని అభిమానులకు ఎప్పుడు చూపిస్తారు? అన్నది చూడాలి. దీపిక గర్భం దాల్చిన దగ్గర నుంచి బేబి బంప్ ఫోటోలు నెట్టింట లీక్ చేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలిద్దరు కలిసి కొన్ని వీడియోలు కూడా షూట్ చేసి ఇన్ స్టాలో వదిలారు. వాటిని చూసి అభిమానులు ఆదర్శదంపతులు అంటూ మురిసిపోయారు.
ఇక దీపిక నుంచి చివరిగా `కల్కి 2898` లో కనిపించారు.పాపాయి రాక ముందు ఈసినిమా విజయం దీపిక కి ఓ గిప్ట్ లాంటింది. ఈ సినిమా పాన్ ఇండియాలో ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం దీపిక `సింగం ఎగైన్` లో నటిస్తుంది. ఇప్పటికే ఆమె పోర్షన్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఆ చిత్రం.