ఆ సమయంలో బతకాలనిపించలేదు..!

మోడీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ దీపికా పదుకునే తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు గురించి చెప్పుకొచ్చింది.

Update: 2025-02-12 23:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి కార్యక్రమంలో మోడీతో పాటు స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునే, బాక్సర్ మేరీ కోమ్‌, సద్గురు, యూట్యూబర్ రాధిక గుప్తా ఇంకా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన చెందనక్కర్లేదని, ఏ విషయాన్ని అయినా మానసిక ఒత్తిడికి గురి అయ్యేంత సీరియస్‌గా తీసుకోవద్దు అంటూ కార్యక్రమంలో హాజరు అయిన వారు సూచించారు. తాజాగా పరీక్షా పే చర్చ కార్యక్రమంకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

మోడీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ దీపికా పదుకునే తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు గురించి చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో తాను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అయినట్లుగా చెప్పింది. తాను ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నాను. చనిపోయేందుకు ఎన్నో రకాలుగా ఆలోచనలు వచ్చేవి. కానీ తను తాను మోటివేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాను. స్కూల్‌ డేస్‌లో చదువు కంటే క్రీడల పట్ల ఆసక్తి, ఆ తర్వాత కొన్నాళ్లకు మోడలింగ్‌పై ఆసక్తి పెరిగింది. మోడలింగ్‌ నుంచి యాక్టింగ్‌కి షిప్ట్‌ అవుతూ వచ్చాను. ఆసక్తి ఉన్న వైపు అడుగులు వేయాలని తాను భావిస్తాను అంది.

2014 నుంచి తాను మానసికంగా కుంగుబాటుకు గురి అయ్యాను. నాలో నేను బాధ పడుతూ ఉండేదాన్ని. నా సమస్య ఏ ఒక్కరి కళ్లకు కనిపించేది కాదు. కానీ ప్రతి క్షణం మనల్ని ఆ సమస్య వేదిస్తూ ఉంటుంది. మనమే కాకుండా మన పక్కన ఉన్న వారు, చుట్టూ ఉన్న వారు ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ మనకు ఆ విషయం అర్థం కాదు. ముంబయిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యింది. ఒకసారి అమ్మ ముంబయి వచ్చిన సమయంలో చెప్పాను. ఆమె నా సమస్యను అర్థం చేసుకుని ఒక సారి సైకాలజిస్ట్‌ వద్దకు వెళ్లమని సూచించారు. ఆమె ప్రోత్సాహంతో తాను సైకాలజిస్ట్‌ వద్దకు వెళ్లాను.

ప్రతి మనిషి జీవితంలోనూ ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి అనేది ఉంటుంది. వాటికి భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుందని భావిస్తే సన్నిహితులతో ఆ విషయాలను పంచుకోవడం ఉత్తమం. సమస్యను గురించి మనలో మనం ఫీల్‌ అవుతూ, బాధ పడుతూ ఉంటే తప్పుడు నిర్ణయాలకు ప్రేరేపితం కావచ్చు. అందుకే నలుగురితో మీ సమస్యను పంచుకోవడం ద్వారా కచ్చితంగా మంచి పరిష్కారం దక్కవచ్చు. అందుకే ఒత్తిడి, కుంగుబాటు సమస్యలను పెద్దవిగా చూడకుండా ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా అంతా మంచి జరుగుతుందని దీపికా పదుకునే అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిని జయించి, బతకాలి అనే ఆలోచన పూర్తిగా పోయిన దీపికా పదుకునే తిరిగి పుంజుకుని ఇప్పుడు బాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్‌గా నిలిచింది. అందుకే ప్రతి ఒక్కరు ఆ వీక్ మూమెంట్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితాన్ని సాగించాలి.

Tags:    

Similar News