సుమతి పాత్రపై దీపిక ఫ్యాన్స్ అసంతృప్తి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898ఏడి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898ఏడి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె కీలక పాత్రలో కనిపించిందన్న విషయం తెలిసిందే.
కల్కి సినిమాకు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఉన్నప్పటికీ ఆ సినిమా ఫ్రాంచైజ్ కు ఉన్న బజ్ క్రమంగా తగ్గుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో రాబోయే టెలివిజన్ ప్రీమియర్ గురించి కూడా పెద్దగా డిస్కషన్స్ జరగకపోగా, ఎవరికీ ఆసక్తి లేనట్టు కనిపిస్తుంది. దీంతో కల్కికి సీక్వెల్ గా రానున్న కల్కి2పై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందేమో అనిపిస్తుంది.
అయితే ఈ సినిమాలో సుమతి పాత్రలో చేసిన దీపికా పదుకొణె కల్కి సినిమాను ఆకాశానికెత్తేసింది. ఆ పాత్రకు ఎంతో బలం ఉందని చెప్పిన దీపికా, ఈ సినిమా కథగా ఇండియన్ మైథాలజీని తీసుకుని దానికి వీఎఫెక్స్ ను జోడించి చెప్పడం వల్ల సుమతి పాత్ర నెక్ట్స్ లెవెల్ లో పండిందని ఆమె వెల్లడించింది.
ఓ వైపు దీపికా తన పాత్ర గురించి, సినిమా గురించి అంత గొప్పగా చెప్తుంటే, ఆమె ఫ్యాన్స్ మాత్రం కల్కిలో సుమతి పాత్రపై అసంతృప్తిగా ఉన్నారు. హీరో వచ్చి రక్షించేవరకు ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటం, ఆమె పాత్ర వేరే వారిపై ఆధారపడి ఉండటాన్ని దీపికా ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. దానికి తోడు కల్కిలో దీపికా చాలా డల్ గా కనిపించడంతో ఆమె ఛార్మింగ్ కూడా మిస్ అయిందని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.
కల్కి2 లో అయినా దీపికకు స్ట్రాంగ్ పాత్ర ఇవ్వాలని, ఆమె పాత్ర ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని ఫ్యాన్స్ మేకర్స్ ను కోరుతున్నారు. మిగిలిన కమర్షయల్ సినిమాల్లోని హీరోయిన్లలా సుమతి పాత్రను కన్నుల విందుగా చూపించకపోయినా, ఆ పాత్రలో బలం ఉండేలా సుమతి పాత్రను డిజైన్ చేయాలని దీపికా ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి2 లో కథ ఎక్కువగా సుమతి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం.