దీపికా పదుకొణె- రణ్వీర్ కుమార్తె పేరు ఏంటో తెలుసా?
ఈ అందమైన జంట తమ పాప తొలి ఫోటోని షేర్ చేస్తూ అందమైన పేరును కూడా వెల్లడించారు.
దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ జంట ఈసారి దీపావళిని చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. ముఖ్యంగా దీపావళి రోజున వారి నవజాత శిశువు (కుమార్తె) పేరును రివీల్ చేసారు. ఈ అందమైన జంట తమ పాప తొలి ఫోటోని షేర్ చేస్తూ అందమైన పేరును కూడా వెల్లడించారు. క్యూట్ డాటర్ పేరు `దువా పదుకొనే సింగ్`. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురికి అందమైన పేరును ఎంచుకున్నారని ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే దువా పాడుకొనే పేరు విన్న వింటనే అసలు `దువా` అంటే అర్థం ఏమిటి? అంటూ అభిమానులు ఆన్ లైన్ లో శోధిస్తున్నారు. ``దువా అంటే ప్రార్థన అని అర్థం. ఎందుకంటే తను మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయాలు ప్రేమ & కృతజ్ఞతతో నిండి ఉన్నాయి`` అని దీపిక సోషల్ మీడియాలో రాసారు.
రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, 83 వంటి చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే. ఇటీవల దీపిక ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మొదటి శిశువుకు స్వాగతం పలికారు. జాయింట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వారు ఈ వార్తలను ప్రకటించారు. వెల్కమ్ బేబీ గర్ల్! 8.9.2024 అని పుట్టిన తేదీ సహా వివరాలను అందించారు. ఇటలీలోని లేక్ కోమోలో 2018లో ఈ జంటకు పెళ్లయింది. ఫిబ్రవరిలో దీపిక గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రణవీర్ తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు కథనాలొచ్చాయి. ఆమె ప్రెజెంటర్‌గా హాజరైన 77వ BAFTA అవార్డులలో పొట్ట భాగాన్ని కవర్ చేస్తున్నది.. ఫోటో తీయడంతో దీపిక ఫ్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. దీపికా - రణవీర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సింగం ఎగైన్‌లో నటించారు. అజయ్ దేవగన్ ఇందులో కథానాయకుడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది.