నా హీరో ఏడిస్తే ఇష్టం..అందుకే అతడ్ని ఇష్టపడ్డా!
రణవీర్ సింగ్-దీపీకా పదుకొణే దంపతుల మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు.
రణవీర్ సింగ్-దీపీకా పదుకొణే దంపతుల మధ్య అన్యోన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో మోస్ట్ లవ్ బుల్ కపుల్ గా పేరొందిన జంట. ఇటీవలే ఆ దంపతులకు పండండి ఆడబిడ్డ జన్మించింది. పాపాయి రాకతో భార్యా భర్తల ఆనందానికి అవదుల్లేవ్. పెళ్లైన ఆరేళ్లకు కలిగిన మొదటి సంతానం. సరిగ్గా ఇదే సమయంలో దంపతుల ఆరవ వివాహ వార్షికోత్సవం తాజాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. వారి జీవితాల్లోకి పాపాయి వచ్చిన తర్వాత చేసుకుంటోన్న తొలి వార్షికోత్సం ఇది. దీంతో సంథింగ్ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
2018 లో వీరి వివావాహం ఇటలీలో జరిగింది. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో ఈ వివాహం జరిగింది. తాజాగా అప్పటి పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుతోంది. అందులో భర్త రణవీర్ గురించి దీపిక కొన్ని విషయాలు పంచుకుంది. `ప్రపంచంలో చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా.
అతనొక నిశబ్దం. అంతేకాదు ఎంతోతెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అది కేవలం నాకే సొంతం. వీటన్నింటికి మంచి గొప్ప మనసున్న వ్యక్తి. అందుకే రణవీర్ ని ఇష్టపడ్డా` అని తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటలీ అందాల్లో ఎంతో వైభవంగా ఈ వివాహం జరిగింది. అందమైన వాతావరణం... గ్రీనరీ..సముద్రం...ఆ మట్టానికి ఎగువున రిసార్స్ట్ ఆ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నంత అందంగా ఉంది.
దీపికను వివాహం చేసుకున్న వెంటనే రణవీర్ ఎంతో సంబర పడ్డాడు. ప్రపంచాన్నే జయించినంత సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అంతేగా తాను ప్రేమించిన అమ్మాయిని అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంటే? అంతకు మించి సంతోషమే.