దీపిక ముందే ఒక హెచ్చరిక వదిలి ఉండాల్సింది!
ఈ ఫోటోలో బ్లాక్ ప్రింటెడ్ బికినీ బ్లౌజ్ ధరించి దీపిక తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ ని ప్రదర్శిస్తోంది. దీనికి తన హబ్బీ రణ్వీర్ క్యూట్ కామెంట్ ని జత చేసాడు.
వెండితెర పై ఆరబోయడంలోనే కాదు.. బహిరంగ వేదికల పై గ్లామర్ షోలతో చెలరేగిపోవడంలోను దీపిక తర్వాతే ఎవరైనా. ఇటీవలి సినిమా ఈవెంట్లలో దీపిక కనిపించిన తీరు అందుకు ఉదాహరణ. గెహ్రయాన్ - పఠాన్ చిత్రాల్లో బికినీ ట్రీట్ తో మతులు చెడగొట్టిన ఈ బ్యూటీ హీరోల తో ఘాటైన రొమాన్స్ చేసింది. ఇక తన సినిమాల నుంచి వేడెక్కించే ఫోటోల ను షేర్ చేయడమే గాక వరుస ఫోటోషూట్లను దీపిక అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.
దీపికా మరోసారి తన హాట్ లుక్ ని ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో బ్లాక్ ప్రింటెడ్ బికినీ బ్లౌజ్ ధరించి దీపిక తన పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ ని ప్రదర్శిస్తోంది. దీనికి తన హబ్బీ రణ్వీర్ క్యూట్ కామెంట్ ని జత చేసాడు. ఈ ఫోటో ని షేర్ చేస్తూ.. "ఒకప్పుడు… చాలా కాలం క్రితం కాదు" అనే వ్యాఖ్యను జోడించగా వెంటనే రణవీర్ సింగ్ ఆ ఫోటో పై వ్యాఖ్యానించాడు. ముందే ఒక హెచ్చరిక వదిలి ఉండాల్సిందని దీపిక కు సూచించాడు. ఈ వ్యాఖ్యకు నెటిజనులు చలాకీగా స్పందించారు. కెరీర్ పరంగా రణవీర్ - దీపిక జంట ఇండస్ట్రీలో ఇతర లవ్ కపుల్ కి ఆదర్శం. ఆ ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకునే విధానం ప్రేమాప్యాయతలు స్ఫూర్తిని నింపుతాయి.
ఇటీవల 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ప్రీమియర్ లో దీపిక-రణవీర్ జంటగా కనిపించారు. ఈ ఈవెంట్లో దీపిక ధరించిన జాకెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్.ఎస్ అని రాసి ఉన్న జాకెట్ ని దీపిక వేసుకుంది. రణ్వీర్- అలియా భట్ల సినిమా ను వైవిధ్యంగా ప్రమోట్ చేసింది. కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీకి కూడా ఈ దంపతులు హాజరయ్యారు. ట్రేడ్ ప్రకారం.. 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' బాక్సాఫీస్ వద్ద 46 కోట్ల వసూళ్లను సాధించింది.
అయితే ఈ సినిమా ని 200కోట్ల బడ్జెట్ తో రూపొందించారని అంత పెద్ద మొత్తం వసూలు చేయడం కష్టమని కంగన లాంటి ఎగ్రెసివ్ నాయికలు విమర్శిస్తున్నారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇందులో జయ బచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అంజలి ఆనంద్, ఝా, అర్జిత్ తనేజా, అర్జున్ బిజ్లానీ, శ్రద్ధా ఆర్య తదితరులు నటించారు. ఈ చిత్రం జూలై 28న థియేటర్లలో విడుదలైంది.