సింగం లో లేడీ సింగం దీపిక!
ఈ సారి రణవీర్ సింగ్..అక్షయ్ కుమార్..కరీనా కపూర్ కూడా 'సింగం' సిరీస్ లో భాగమవడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'సింగం' గురించి చెప్పాల్సిన పనిలేదు. అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు భాగాలు భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం 'సింగం' ఎగైన్ అంటూ మళ్లీ బాక్సాఫీస్ కోతకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి రణవీర్ సింగ్..అక్షయ్ కుమార్..కరీనా కపూర్ కూడా 'సింగం' సిరీస్ లో భాగమవడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇలా సినిమాలో ఇంత మంది స్టార్లు భాగం కావడంతో తెరంతా నిండుదనం కనిపిస్తుంది. అయితే ఇప్పుడా నిండుదనానికి మరో స్టార్ బ్యూటీ కూడా యాడ్ అయింది.
దీపికా పదుకొణే కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నట్లు రివీల్ చేసారు. ఇందులో దీపిక పోలీస్ పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవగణ్ సిస్టర్ రోల్ ఇది. ఈ పాత్రకి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ప్రారంభ మయ్యాయి. ఇందులో దీపిక పాత్ర లేడీ సింగమ్ తరహాలో పవర్ పుల్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం దీపిక ఏకంగా 40 రోజులు కాల్షీట్లు కేటాయించింది. దీంతో ఆమె రోల్ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఉంటుందని తెలుస్తోంది.
అన్నా-చెల్లి ఇద్దరు సింహాల్లా విరుచుకుపడుతుంటే? ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సింహం సింగిల్ గానే వస్తేనే వేటలో కావాల్సినంత మజా దొరికింది. అలాంటిది రెండు సింహాలు ఒకేసారి దాడికి దిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. 'సింగం ఎగైన్' లో అలాంటి సన్నివేశాలు దారళంగా రోహిత్ శెట్టి దట్టిస్తారు.
ఓవైపు అజయ్..మరోవైపు దీపిక లాఠీ ఝుళిపిస్తుంటే? థియేటర్లో రచ్చ రచ్చే. దీపిక ఇలాంటి పవర్ ఫుల్ రోల్ ఇంతవరకూ పోషించలేదు. అందులోనూ కాఖీ ధరించి..లాఠీ పట్టింది లేదు. ఈ నేపథ్యంలో ఆ పాత్ర కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో దీపిక నటించడం పట్ల అజయ్ దేవగణ్ సంతోషం వ్యక్తం చేసారు. సినిమాలో చాలా స్పెషల్ గా దీపిక పాత్ర ఉంటుందని...కొత్త దీపికని తెరపై చూస్తారని ధీమా వ్యక్తం చేసారు.