గ‌ర్భ‌వ‌తిగా దీపికా నో డైట్ అంటూ ఆల్ రౌండ‌ర్!

50 ఏళ్ల బ్యూటీ కూడా 30 లో క‌నిపించాలి అంటే ఇవ‌న్నీ చేయ‌క త‌ప్ప‌దు. వీటిని బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే అతీతం కాదు.

Update: 2024-07-18 10:30 GMT

సెల‌బ్రిటీలంటే డైట్ త‌ప్ప‌నిస‌రి. అన్ని త‌గిన మోతాదులో తీసుకోవాలి. హీరోయిన్ గా ఆ బ్యూటీని కాపాడుకోవాలంటే ఇలాంటి వ‌న్నీ చేస్తే త‌ప్ప ప‌న‌వ్వ‌దు. అందుకే హీరోయిన్లు అంతా ఫిట్ నెస్ ప‌రంగా అంత కేరింగ్ తీసుకుంటారు. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కూడ‌దు...ఎప్పుడూ నిగ‌నిగ‌లాడాలి. 50 ఏళ్ల బ్యూటీ కూడా 30 లో క‌నిపించాలి అంటే ఇవ‌న్నీ చేయ‌క త‌ప్ప‌దు. వీటిని బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే అతీతం కాదు.

ఆమె కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్. డైలీ జిమ్, యోగా , ప‌రిమిత ఆహారం తీసుకోవ‌డం వంటివి చేస్తుంది. అయితే గ‌ర్భ‌వ‌తి గా ఉన్న స‌మ‌యంలో కూడా దీపిక డైట్ ఫాలో అవుతుంద‌నే ఓ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. గ‌ర్భందాల్చిన ద‌గ్గ‌ర నుంచి పుడ్ త‌క్కువ తీసుకుంటుంద‌ని...రైస్ కి బ‌ధులుగా ర‌క‌ర‌కాల ఐట‌మ్స్ తీసుకుంటుంద‌ని.. అలాగే ఐస్ క్రీమ్ లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ ప్ర‌చారాన్ని దీపిక కండించింది.

డైట్ లేదు..ఏం లేదు అన్ని క‌లిపి తినేస్తున్నాను చెప్పింది. `నేను బాగా తింటాను. కంటికి ఏది క‌నిపించినా తినాల‌నిపిస్తుంది. ఇప్పుడైతే అన్నింటిని లాగించేస్తున్నా. సినిమాలు చేయ‌లేదు కాబ‌ట్టి ఇబ్బంది లేకుండా తింటున్నా. అదే సినిమాలు చేస్తే ఇలా తిన‌డానికి వీలు ప‌డ‌దు. డైట్ అంటే నా ఉద్దేశంలో క్ర‌మం త‌ప్ప‌కుండా తినడం, శ‌రీరాన్ని అర్దం చేసుకోవ‌డం. త్వ‌ర‌గా బ‌రువు తగ్గే ఆహార ప్ర‌ణాళిక అస్స‌లు ఫాలో కాను.

క‌డుపునిండా తిన‌డానికే చూస్తాను. పైగా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు పుష్టిగా తినాలని పెద్ద‌వాళ్లు అంటారు. ఇప్పుడ‌దే అనుస‌రిస్తున్నాను. క‌డుపులో బిడ్డ‌కు ఇది ఎంతో ముఖ్యం` అని అంది. సెప్టెంబ‌ర్ లో దీపిక ప్ర‌స‌వం జ‌రుగుతుంద‌ని ఇప్ప‌టికే రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంట్లో త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో విశ్రాంతి తీసుకుంటుంది.

Tags:    

Similar News