దేవర చేతిలో కళ్ళు చెదిరే అందం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ "దేవర"పై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

Update: 2024-08-05 06:10 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ "దేవర"పై ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫామ్ లో లేని కొరటాల ఈసారి గట్టిగా కొట్టాలని ఉండగా, రాజమౌళి సినిమా తరువాత హీరోలకు డిజాస్టర్ వస్తుంది అనే ట్రెండుకు తారక్ ఎండ్ కార్డ్ పెట్టాలని అనుకుంటున్నాడు. "ఆర్ఆర్ఆర్" వంటి ఘనవిజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమాను ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


అయితే, ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల అవుతుండగా మొన్నటివరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో హడావుడి ఏమి కనిపించలేదు. అందరూ తహతహలాడుతూ ఎదురు చూస్తున్న "దేవర" చిత్రం నుంచి విడుదలైన మొదటి సింగిల్ అభిమానులను కొంత ఉత్సాహపరిచినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి ప్రాముఖ్యమైన అప్డేట్లు లేకపోవడం ఫ్యాన్స్ కు కొంత చిరాకు తెప్పించింది.

ఇక ఫైనల్ గా మేకర్స్ సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడిగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో సౌండ్ పెంచారు. ఇక పాటకు సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ పాత్రల కెమిస్ట్రీని హైలెట్ చేసేలా 'చుట్టమల్లే' అనే పాటను కంపోజ్ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో పాట రానుండగా మేకర్స్ అద్భుతమైన పోస్టర్ వదిలారు.

ప్రకృతిలో కలిసిపోయిన ఒక ఐలాండ్ బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తోంది. ఇక తీరంలో దేవర - తంగం ఇద్దరు రొమాంటిక్ పోజులో కళ్ళు చేదిరేలా దర్శనమిచ్చారు. ముఖ్యంగా జాన్వీ చీరలో సన్నని కొంగుతో మైండ్ బ్లాక్ చేసేసింది. పోస్టర్ లోనే జాన్వీ అందం తారక్ లుక్ చూస్తుంటే సాంగ్ లో కాంటెంట్ బలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ తరహాలో హైప్ ఇస్తూ ఉండగా సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది. అలాగే మరికొన్ని డిఫరెంట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి ఒక కామెంట్ చేశారు. ఇలాంటి పాట ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చి చాలా కాలమైంది అని పేర్కొన్నారు. ఇక ఆ కామెంట్ కౌంటర్ గా 'ఇంతలా హైప్ పెంచుతున్నారు.. బాగానే ఉంది, కానీ సాంగ్ రిలీజ్ అనంతరం అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇక వెంటనే రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ.. హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్ళీ చెప్పు ఇక్కడే ఉంటా.. అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి చుట్టమల్లే పాట సినిమాపై మరింత అంచనాలు పెంచేసేలా ఉంది. ఇక సినిమా విడుదలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ఫ్యాన్స్ ఇప్పుడు మరింత ప్రమోషన్లను ఆశిస్తున్నారు. ముఖ్యంగా, అన్ని భాషల్లో కూడా సినిమాను బలంగా ప్రమోట్ చేయడం ద్వారా ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచుకోవాలి.

Tags:    

Similar News