పాన్ ఇండియాలో మరో 'బహుబలి'!
పాన్ ఇండియాలో మరో `బాహుబలి` దిగుతుందా? మరో భారీ పిరియాడిక్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది.
పాన్ ఇండియాలో మరో `బాహుబలి` దిగుతుందా? మరో భారీ పిరియాడిక్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. అయితే ఈసారి ఆ ఛాన్స్ తీసుకుంటుంది టాలీవుడ్ కాదు కోలీవుడ్. అవును ఇది అక్షర సత్యం. తల అజిత్ కథానాయకుడిగా `కనులు కనులు దోచాయంటే` ఫేం దేశింగ్ పెరియసామి ఆ సాహసానికి పూనుకుంటున్నాడు. దేశింగ్ తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
దీంతో తదుపరి ప్రాజెక్ట్ ని ఏకంగా పాన్ ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా `బాహుబలి` తరహాలో ఉంటుందని సమాచారం. భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని సమాచారం. మొత్తానికి కోలీవుడ్ నుంచి బాహుబలి లాంటి సినిమా దిగడం అన్నది గొప్ప విషయమే. కోలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ కోసం ఎంతగా తపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవలే `కంగువ` సినిమాతో సూర్య ఓ అటెంప్ట్ చేసాడు. కానీ ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది. అంతకు ముందు `తంగలాన్` తో విక్రమ్ కూడా ఓ ప్రయోగం చేసాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి స్టార్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారుగానీ ఇంతవరకూ వాళ్ల సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. దీంతో కోలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ అన్నది అందని ద్రాక్షగానే మారింది.
ఈ నేపథ్యంలో దేశింగ్ `బాహుబలి` లాంటి కంటెంట్ ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అందులో అజిత్ అవ్వడం అన్నది మరో సంచలన విషయం. అజిత్ నిజంగా బాహుబలి లాంటి కటౌట్. ఆ కథకి పక్కాగా సెట్ అయ్యే నటుడు. ఇప్పటివరకూ అతడు పిరియాడిక్ స్టోరీలను టచ్ చేసింది లేదు. మరి దేశింగ్ అటెంప్ట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో అధికారికంగా బయటకు రానుంది.