ఆ హీరోతో పూజాహెగ్డే లిప్ లాక్ అంత ప్రమాదమా?
తాజాగా సెన్సార్ ముందుకెళ్లిన చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాలకు...పదాలకు సెన్సార్ కత్తెర వేసింది.
బుట్టబొమ్మ పూజాహెగ్డే నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఏడాదిన్నరవుతుంది. 'కిసీకా భాయ్ కిసీకా జాన్' తర్వాత అమ్మడు వెండి తెరపై కనిపించలేదు. కమిట్ అయిన హిందీ సినిమాల షూటింగ్ డిలే అవ్వడంతో? రిలీజ్ కి నొచ్చు కోవడం లేదు. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత అమ్మడు 'దేవా'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఇందులో అమ్మడు షాహిద్ కపూర్ కి జోడీగా నటించింది.
రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమాలో రొమాన్స్ కూడా ఘాడంగానే కనిపిస్తుంది. తాజాగా సెన్సార్ ముందుకెళ్లిన చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాలకు...పదాలకు సెన్సార్ కత్తెర వేసింది. సెకాండాఫ్ చాలా కోతలు పడినట్లు తెలుస్తోంది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు...అసభ్య పదజాలం ఉన్న సన్నివేశాలతో పాటు సంభాషణలకు కత్తెర వేసారు.
ప్రధానంగా సినిమాలో 6 సెకెన్ల లిప్ లాక్ సీన్ కు సెన్సార్ కత్తెర వేసింది. షాహిద్ కపూర్- పూజాహెగ్డే మధ్య ఈ లిప్ లాక్ సీన్ డోస్ ఓవర్ గా ఉండటంతో? కత్తెర వేయక తప్పలేదని తెలుస్తోంది. సాధారణంగా లిప్ లాక్ సన్నివేశాలకు సెన్సార్ అభ్యంతరం చెప్పడం అన్నది చాలా రేర్ గా జరుగుతోంది. సన్నివేశంలో ఘాడతను బట్టి ఉంచాలా? తుంచాలా? అన్నది డిసైడ్ అవుతుంది.
అయితే ఈ లిప్ లాక్ విషయంలో సెన్సార్ మరింత లోతుగా విశ్లేషించి ఇలాంటి సన్నివేశాలు యువతపై ప్రభావాన్ని చూపించేలా ఉంటాయని భావించి కట్ విధించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని సన్నివేశాలను ట్రిమ్ చే యాల్సిందిగానూ సూచించిందిట. మొత్తంగా సెన్సార్ అనంతరం 156 నిమిషాల 59 సెకెన్లతో సినిమా కనిపిస్తుంది. ఈ చిత్రం జనవరి 31న విడుదల అవుతుంది.