తాళిబొట్టు విసిరి ముఖాన కొట్టింది!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవదాస్ తమ బంధం గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.
అలనాటి అందాల తార దేవిక వందకు పైగా సినిమాల్లో నటించారు. 'అడవాళ్లే అలిగితే', 'ఆడ బ్రతుకు', 'అన్నాచెల్లెలు', 'బాటసారి',' దేశ ద్రోహులు' ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిగా సత్తా చాటారు. అటుపై 1968 లో దర్శకుడు దేవదాస్ ను వివాహం చేసుకుంది. ఈ దంతపతులకు కనక అనే కుమార్తె ఉంది. కానీ ఈ వివాహ బంధం ఎంతో కాలం నిలబడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవదాస్ తమ బంధం గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.
'దేవిక నా వెంట పడి పట్టుబడి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు నాకు ..మీకు కుదరదని చెప్పేసాను. బ్రతిమ లాడింది పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. కానీ ఆమెది నిజమైన ప్రేమ కాదని కాల క్రమంలో అర్దమైంది. పెళ్లి సమయానికి తన దగ్గర చిల్లి గవ్వలేదు. డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. నేను పెద్ద డైరెక్టర్ అవుతానని భావించి తన చెప్పు చేతల్లోఉంచుకోవాలనుకుంది.
కానీ నేను స్వతంత్ర భావాలున్న వాడిని. నాకు నచ్చినట్లు నేను ఉండేవాడిని. దీంతో నన్ను మనిషిగా చూసేది కాదు. ఓ రోజు మెడలో తాళిబట్టు నా ముఖాన విసిరేసింది. నన్ను చంపాలని చూసింది. అందుకోసం మనుషుల్ని కూడా పంపించింది. దీంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేసాను. 32 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగాం. ఆ సమయంలో దేవిక తల్లి చనిపోయింది. కానీ అప్పటికీ ఆస్తి వీలునామా రాయలేదు.
అప్పుడు దేవిక తన తల్లి సంతకం పోర్జరీ చేసి ఆస్తి దక్కించుకుంది. కుమార్తె కనక ఇష్టం లేకపోయినా తల్లిదగ్గరే ఉండాలనే కోర్ట్ ఆర్డర్ ఉండటంతో దేవిక తీసుకెళ్లింది. చిన్నప్పటి నుంచి కుమార్తె తన దగ్గరే ఉండటంతో మనసు మార్చేసింది. కూతురు దగ్గర నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది. అందుకే దేవిక చనిపోయినా నేను వెళ్లలేదు. తల్లి లాగే కూతురు తయారైంది. ఇప్పుడు నేను ఉంటోన్న ఇల్లు తనదని కనక కేసు పెట్టింది' అని తెలిపారు.