దేవకి నందన వాసుదేవ.. వచ్చేది ఎప్పుడంటే..

దీంతో ఫైనల్ గా "దేవకి నందన వాసుదేవ" సినిమాను నవంబర్ 22న విడుదల చేయనున్నారు. సినిమాకు ఇది పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు.

Update: 2024-11-09 13:03 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, లెజెండరీ నటుడు కృష్ణ మనవడు అశోక్ గల్లా మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక రెగ్యులర్ గా కాకుండా మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అతను కొంత గ్యాప్ తీసుకున్నాడు. అతని నుంచి రెండో సినిమాగా "దేవకి నందన వాసుదేవ"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

అర్జున్ జండ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు సంబంధించిన ప్రమోషన్స్ హడావుడి ఇదివరకే మొదలైంది. ఇక గుణ 369తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అర్జున్ జండ్యాల మరొక సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని లలితాంబిక ప్రొడక్షన్స్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు, అలాగే నల్లపనేని యామిని సమర్పణలో తెరకెక్కించారు.

అసలైతే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా నవంబర్ 14న విడుదల అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాల వలన వారం పాటు విడుదల వాయిదా పడింది. దీంతో ఫైనల్ గా "దేవకి నందన వాసుదేవ" సినిమాను నవంబర్ 22న విడుదల చేయనున్నారు. సినిమాకు ఇది పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు. సమయం అదనంగా రావడం వల్ల ప్రమోషన్స్‌కు మరింత సమయం దక్కింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.

దేవకి నందన వాసుదేవ.. టైటిల్ తోనే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాలో అశోక్ గల్లా మాస్, యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నాడు. విడుదలైన గ్లింప్స్ చూస్తే, ఈ యాక్షన్‌ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది. చిత్రకథ ఆధ్యాత్మికతతో పాటు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చిత్ర బృందం ఆశాభావంతో ఉంది.

సినిమాలో వారాణసి మానస అశోక్ గల్లాకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి కథను సృజనాత్మక దర్శకుడు హనుమాన్‌ ఫేమ్‌ ప్రసాద్ వర్మ అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. సంగీతాన్ని భీమ్స్‌ సిసిరోలియో అందించగా, ప్రసాద్ మురెళ్ళ మరియు రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేట్రికల్ రైట్స్‌ను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. మరి దేవకి నందన వాసుదేవ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News