దేవరలో నిజమైన సంఘటన?

కొన్ని సినిమా కథలు నిజ జీవితల సంఘటనల స్ఫూర్తితోనే దర్శకులు రెడీ చేసుకుంటారు.

Update: 2024-09-03 08:21 GMT

కొన్ని సినిమా కథలు నిజ జీవితల సంఘటనల స్ఫూర్తితోనే దర్శకులు రెడీ చేసుకుంటారు. కాస్తా సినిమాటిక్ క్రియేటివిటీ జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తారు. లేదంటే కంప్లీట్ గా ఫిక్షనల్ ఆలోచనలతో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ రూట్లో వచ్చే మాస్ యాక్షన్ కథలని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. కొరటాల శివ కూడా అప్పుడప్పుడు రియల్ లైఫ్ సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తూ వచ్చారు.

జనతా గ్యారేజ్ కూడా హైదరాబాద్ లోని ఒక పహిల్వాన్ ను చూసి కథ అల్లినట్లు ఒక టాక్ అయితే ఉంది. కొరటాల శివ తెరకెక్కించిన సినిమాలు మేగ్జిమమ్ సక్సెస్ అయ్యాయి. ఒక్క ఆచార్య మూవీ మాత్రమే డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే దేవర సినిమాని కొరటాల శివ రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కించారంట. 1987లో కారంచేడులో జరిగిన దళితుల ఊచకోత ఘటన అందరికి గుర్తుండే ఉంటుంది.

రెండు కులాల మధ్య జరిగిన ఈ గొడవ ఎనిమిది మంది దళితుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన స్ఫూర్తితోనే దేవర కథని కొరటాల శివ రాసుకున్నారంట. అయితే కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసి అందులో ఈ కథకి తనదైన స్క్రీన్ ప్లే జోడించి సరికొత్తగా చెప్పబోతున్నారంట. అయితే కారంచేడు ఘటన స్ఫూర్తితో దేవర కథ తయారైంది అనే మాట ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు.

ఆమధ్య గోపిచంద్ మలినేని - రవితేజ సినిమా ఈ తరహా బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రాజెక్టు చేయాలని అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఒక పోస్టర్ కూడా వదిలారు. మళ్ళీ ఎందుకో వెనుకడుగు వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే దేవర అదే ఘటన స్టోరీ లైన్ ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కారంచేడు ఘటన స్ఫూర్తితో దేవర సినిమా చేస్తే ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక వర్గానికి కాపు కాసేవాడిగా కనిపిస్తున్నాడు. అలాగే సైఫ్ అలీఖాన్ పాత్ర దొంగముఠా నాయకుడిగా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

Tags:    

Similar News