దేవర.. UKలో తగ్గడం లేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-09 14:04 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా దేవర అదరగొడుతోంది. దసరా హాలీడేస్ కావడంతో మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.

ఇక ఓవర్సీస్ లో దేవర దూకుడు మామూలుగా లేదు. వేరే లెవెల్ లో బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. భారీ వసూళ్లను అందుకుని సత్తా చాటుతోంది. మేకర్స్ కు భారీ లాభాలు అందిస్తోంది. అదే సమయంలో మేకర్స్.. బుధవారం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. యూకే బాక్సాఫీస్ వద్ద దేవర సంచలనాలు సృష్టిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 5,41,506 పౌండ్స్ కు పైగా వసూలు చేసినట్లు వెల్లడించారు. భారీ బ్లాక్‌ బస్టర్ గా మూవీ దూసుకెళ్తుందని ప్రకటించారు.

అయితే దేవర మూవీ.. రిలీజ్ కు ముందే యూకేలో రికార్డులు సృష్టించింది. ప్రీమియర్ షోస్ కు ఎన్నడూ లేనంతగా రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్స్ కు ఇప్పటి వరకు 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన తొలి తెలుగు ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. యూకేలోని డాల్బీ అట్మాస్‌ లో ప్రదర్శించిన తొలి తెలుగు సినిమా కూడా నిలిచింది. ఇప్పుడు థియేట్రికల్ రన్ లో అదరగొడుతోంది. మరిన్ని వసూళ్లను కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆరా మజాకా అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నెట్టింట ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. దేవర మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. అందులో తారక్ వేరే లెవెల్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో వేట కొడవలితో ఊచకోత కోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆకట్టుకుంటున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. తారక్ డ్యూయల్ రోల్ పోషించారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. విలన్ గా బీటౌన్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కనిపించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. అదిరిపోయే మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Tags:    

Similar News