నార్త్ అమెరికా ప్రీమియర్స్… హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాలలో దేవర స్థానం ఎంతంటే?

ఈ కలెక్షన్స్ బట్టి మన తెలుగు పాన్ ఇండియా మూవీస్ కి నార్త్ అమెరికాలో ఎలాంటి ఆదరణ వస్తుందో చెప్పవచ్చు.

Update: 2024-09-26 07:19 GMT

టాలీవుడ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ఎక్కువ ప్రజాధారణ లభించేది నార్త్ అమెరికాలోనే. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ సినిమాల జాబితాలో మొదటి, రెండు స్థానాలలో తెలుగు మూవీస్ ఉన్నాయి. ‘బాహుబలి 2’ చిత్రం 20.77 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత టాప్ 2లో ‘కల్కి 2898ఏడీ’ మూవీ ఉంది. ఈ చిత్రం 18.57 మిలియన్ డాలర్స్ లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది.

ఈ కలెక్షన్స్ బట్టి మన తెలుగు పాన్ ఇండియా మూవీస్ కి నార్త్ అమెరికాలో ఎలాంటి ఆదరణ వస్తుందో చెప్పవచ్చు. మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు అన్నింటికి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ పడతాయి. ఈ ప్రీమియర్ కలెక్షన్స్ పరంగా కూడా తెలుగు సినిమాలు సత్తా చాటుతూ ఉండటం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ప్రీమియర్స్ కోసం భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఎన్టీఆర్ కూడా ప్రీమియర్ షోలో దేవర మూవీని ఫ్యాన్స్ తో కలిసి చూడటానికి యూఎస్ వెళ్లారు.

‘దేవర’ మూవీ ప్రీమియర్స్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 2.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్ షోలతో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో ‘దేవర’ టాప్ 5లోకి వచ్చింది. మొదటి స్థానంలో 3.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. రెండో స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఉంది. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా 3.46 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది.

మూడో స్థానంలో ఉన్న ప్రభాస్ సలార్ మూవీ 2.6 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ప్రీమియర్స్ తో సాధించింది. నాలుగో స్థానంలో కూడా ప్రభాస్ బాహుబలి 2 ఉంది. ఈ చిత్రం 2.45 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ప్రీమియర్స్ తో వసూళ్లు చేసింది. దేవర మూవీ ప్రీమియర్స్ కి ఇంకా సమయం ఉండటంతో బాహుబలి 2 కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీమియర్ షో కలెక్షన్స్ పరంగా టాప్ 10లో ఉన్న సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

కల్కి 2898 ఏడి – $3.9M

ఆర్ఆర్ఆర్ – $3.46M

సలార్ – $2.6M

బాహుబలి 2 – $2.45M

దేవర – $2.4M***

అజ్ఞాతవాసి – $1.52M

గుంటూరు కారం – $1.42M

బాహుబలి – $1.37M

ఖైదీ నంబర్ 150 – $1.29M

స్పైడర్ – $1M

Tags:    

Similar News