దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్… గెస్ట్ ఎవరంటే?

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును పిలవాలని మేకర్స్ అనుకుంటున్నారు.

Update: 2024-09-14 06:25 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కొంత అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ దేవర సినిమాకి వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. ఈ సాంగ్స్ ట్రైలర్ పై కొంత నెగిటివ్ వైబ్ క్రియేట్ అయిన ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేశాయి.

దీనిని బట్టి దేవర మూవీ కోసం దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో కరణ్ జోహార్, అలియా భట్ తో కలిసి ఇంటర్వ్యూలలో తారక్ పాల్గొన్నారు. ముంబైలో మరిన్ని ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా కొన్ని ప్రమోషన్ ఆక్టివిటీస్ షురూ చేశారు. హీరోలతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ప్లానింగ్ లో ఉన్నాయి.

సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఉండబోతుంది. ఇక దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 లేదా 22 తేదీలలో నిర్వహించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. సెప్టెంబర్ 22 ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉందంట. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును పిలవాలని మేకర్స్ అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ తో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. అలాగే కొరటాల శివ మహేష్ కు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహేష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడని అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ టీమ్ నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అసలే రాజమౌళి మహేష్ ను ఎక్కడికి పంపడం లేదని టాక్. మరి తారక్ ఓ మాట చెబితే వదులుతారో లేదో చూడాలి.

అలాగే అల్లు అర్జున్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దేవర ప్రమోషన్స్ లో బన్నీ భాగం కావడం అయితే గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. ఇక మహేష్ బాబు సైతం ఈవెంట్ కి వస్తే మాత్రం కచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. మహేష్ క్రేజ్ దేవర సినిమాకి కూడా ఎంతో కొంత పాజిటివ్ వైబ్ తీసుకువస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా దేవర సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోలని భాగం చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా కన్నడ ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి పాల్గొనవచ్చని అనుకుంటున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్ కి విపరీతమైన ప్రజాధరణం ఉంది. అది దేవర సినిమా కలెక్షన్స్ విషయంలో ఖచ్చితంగా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీస్ తో ఆయా భాషలలో మరింత మందికి చిత్రం చేరువ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News