యూఎస్ ప్రీమియర్స్.. రంగంలోకి ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది.

Update: 2024-09-13 07:46 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకొని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే ఫ్యాన్స్ తో ముచ్చటించే కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. ముంబైలో దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత అక్కడ మీడియాలో ఎన్టీఆర్ మాట్లాడారు.

అలాగే కరణ్ జోహార్, అలియాభట్ తో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్స్ పైన తారక్ ఫోకస్ చేయబోతున్నాడంట. ఇదిలా ఉంటే యూఎస్ లో ఒక రోజు ముందుగానే దేవర మూవీ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ ప్రీమియర్ షోలకి భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ 30000 దాటేశాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకా జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయంట.

ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ కి ఎన్టీఆర్ అటెండ్ కాబోతున్నాడంట. సెప్టెంబర్ 26న బియాండ్ ఫెస్ట్ లో భాగంగా లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో వేసే స్పెషల్ ప్రీమియర్స్ కి తారక్ హాజరవ్వబోతున్నట్లు సమాచారం. ప్రీమియర్ షో తిలకించడంతో పాటు ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ అడ్రెస్ చేస్తారంట. తరువాత మీడియా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.

బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించబడుతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా దేవర నిలవబోతుందంట. హాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది బియాండ్ ఫెస్ట్ లో పాల్గొంటారనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న యూఎస్ వెళ్లి 26న స్పెషల్ ప్రీమియర్స్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రీమియర్ షోలో చిత్ర బృందం కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

బియాండ్ ఫెస్ట్ లో దేవర ప్రీమియర్స్ కి హాజరు కాబోతున్న ఎన్టీఆర్ అక్కడ హాలీవుడ్ స్టార్స్ ను ఏమైనా మీట్ అయ్యే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ కలిస్తే మాత్రం కచ్చితంగా అది ఇండియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారే ఛాన్స్ ఉంటుంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. వీరిద్దరూ కూడా యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ కి అటెండ్ అవుతారా లేదా అనేది క్లారిటీ లేదు.

Tags:    

Similar News