దేవర రిలీజ్ ట్రైలర్.. స‌ముద్రం మీద ఒక దేవ‌ర

పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ తోపాటు అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ తో కొత్త ట్రైలర్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Update: 2024-09-22 09:10 GMT

ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్-1పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమా కోసం వేయి కళ్లతో ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో బీటౌన్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా సందడి చేయనున్నారు.

మరికొద్ది రోజుల్లో దేవర రిలీజ్ కానుండడంతో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతున్నారు. వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో అదిరిపోయే పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్ ను విడుదల చేయగా.. అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇటీవల సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారు.

ఇప్పుడు మూవీపై అంచనాలు.. ఆకాశాన్ని తాకేలా రిలీజ్ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పవర్‌ ఫుల్ డైలాగ్స్‌ తోపాటు అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ తో కొత్త ట్రైలర్‌ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఏది కోరుకున్నారో.. అంతకు మించి పోయేలా ట్రీట్ ఇచ్చారు మేకర్స్. మూవీ కచ్చితంగా చూడాలనే విధంగా రిలీజ్ ట్రైలర్ ను కట్ చేశారు.

'నిన్న రేత్రి ఓ పీడ‌క‌ల వ‌చ్చుండాది జోగుళ‌.. సంద్రం ఎరుపెక్కి నిజంగా ఎర్ర స‌ముద్రం అయిన‌ట్లు, అది నా చేతుల మీద అయిన‌ట్లు క‌నిపించుండాది' అంటూ ఎన్టీఆర్ గంభీర‌మైన వాయిస్‌ తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. 'భ‌యం పోవాలంటే దేవుడి క‌థ ఇనాలా...భ‌యమంటే ఏంటో తెలియాలంటే దేవ‌ర క‌థ ఇనాలా.. స‌ముద్రం మీద ఒక దేవ‌ర ఉన్నాడు చాలు..' అన్న డైలాగ్స్ ఇంట్రెస్ట్ పెంచేశాయి.

ట్రైలర్ చివర్లో మేకర్స్ చూపించిన తారక్ డ్యాన్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. విజువ‌ల్స్‌ తోపాటు స‌ముద్రం బ్యాక్‌ డ్రాప్‌ లో వ‌చ్చిన సీన్స్‌ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ అసెట్ గా మారింది. జాన్వీ కపూర్ తన లుక్స్ తో ఎట్రాక్ట్ చేసింది. కొరటాల శివ మార్క్ క్లియర్ గా కనిపించింది. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడనున్నామని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. మరి సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కానున్న మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News