స‌క్సెస్ అనంత‌రం తార‌క్ స్పెష‌ల్ స‌క్సెస్ బాష్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల‌ముందుకొస్తుంది.

Update: 2024-09-26 16:01 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల‌ముందుకొస్తుంది. ఆ గ‌డియ‌లు కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల వ‌ద్ద జాతర మొద‌లైపోయింది. పూల మాల‌తో అలంక‌రించి? షో కోసం సిద్దంగా ఉన్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత తార‌క్ తొలి పాన్ ఇండియా సోలో రిలీజ్ ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు అంత‌కంత‌కు హైప్ పెంచాయి.

అన్న బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయమంటూ అభిమానులంతా ధీమాగా ఉన్నారు. అయితే తార‌క్ మాత్రం స‌క్స‌స్ పార్టీని గ్రాండ్ గానే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం తార‌క్ కుటుంబంతో అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ షో చూసి స‌క్సెస్ అందుకుని హైద‌రాబాద్ లో ల్యాండ్ అవ్వాల‌న్న‌ది బాబు ప్లాన్. ఇక పార్టీకి ఎవ‌రెవ‌ర్నీ ఆహ్వానిం చాల‌న్న ప్లాన్ సైతం రెడీగా ఉందని తార‌క్ మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది.

ప్ర‌చారంలో భాగంగా విశ్వ‌క్ సేన్ మీకోసం ఇంత చేస్తున్నాం? పార్టీ లేదా అన్నా? అన్న‌ట్లు ఓ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చాడు. దానికి తార‌క్ ప్ర‌స్తుతానికి కావాలంటే బిర్యానీ వండి పంపిస్తాను పండ‌గ చేస్కొండి. పార్టీ అన్న‌ది 27 త‌ర్వాత ఉంటుంది. ఆ త‌ర్వాత మీఇష్టం... మీరు ఎలా ఎంజాయ్ చేయాల‌నుకుంటే? అలా గ్రాండ్ పార్టీ ఇస్తా అన్నారు. మ‌రి తార‌క్ స్నేహితులంద‌రికీ గ్రాండ్ పార్టీ ఇచ్చేలా విక్ట‌రీ న‌మోదు చేయాల‌ని ఆశిద్దాం.

సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ మొద‌లైంది. ప‌రీక్ష రాసిన విద్యార్ధుల్లో దేవ‌ర టీమ్ అంతా ఎదురు చూస్తుంది. సినిమా విజ‌యం సాధించాల‌ని? ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సతీమ‌ణితో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి గ‌త సినిమా ఆచార్య ఆశించిన ఫ‌లితం సాధించ‌ని సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News