దేవరకు కలిసొచ్చేలా ఓ మెగా సెంటిమెంట్..

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ని ఫ్యాన్ బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు.

Update: 2024-09-11 10:30 GMT

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ని ఫ్యాన్ బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు. అలాగే కాంబినేషన్స్ ని కూడా నమ్ముతూ ఉంటారు. గతంలో వర్క్ అవుట్ అయిన కాంబినేషన్స్ లో మరో సినిమా వస్తే కచ్చితంగా గ్యారెంటీ హిట్ అని భావిస్తారు. అలాగే ఇండస్ట్రీలో మెగా హీరోలకి ఫ్లాప్ లు ఇచ్చిన దర్శకులు తరువాత నందమూరి హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్ విషయంలో ఈ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే దేవర సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ మరల రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. దీనికి కారణం ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ బాబీ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత బాబీ ఎన్టీఆర్ తో జై లవకుశ మూవీ చేసి బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు.

అలాగే అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ డిజాస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా దెబ్బతో త్రివిక్రమ్ పని అయిపోయిందని అందరూ కామెంట్స్ చేశారు. అయితే మాటల మాంత్రికుడు తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అలాగే ఆచార్య మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర మూవీతో సూపర్ హిట్ కొడతాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

మెగా హీరోలతో డిజాస్టర్స్ అందుకున్న ఇద్దరు దర్శకులు తరువాత జూనియర్ ఎన్టీఆర్ కి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే దేవర మూవీ అంతకుమించి బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ దేవర మూవీ సక్సెస్ అయితే ఈ సెంటిమెంట్ బలంగా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూవీపై ఇప్పటి వరకు అయితే పాజిటివ్ బజ్ ఉంది.

అనిరుద్ రవిచందర్ అందించిన సాంగ్స్ వర్క్ అవుట్ అయ్యాయి. అలాగే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కొరటాల శివ తన స్టైల్ లో సోషల్ ఎలిమెంట్ ని తీసుకొని పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ చిత్రాన్ని డిజైన్ చేసినట్లు ట్రైలర్ ను బట్టి అర్ధమవుతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మరి ప్రేక్షకులని ఈ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News