ఎట్టకేలకు దేవిశ్రీ ప్రసాద్‌ స్పందన..!

అది దేవిశ్రీ ప్రసాద్ తప్పు అంటూ కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం సాంకేతిక సమస్యల కారణంగా అలా జరిగిందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

Update: 2025-01-18 12:30 GMT

తమిళ్ స్టార్‌ హీరో సూర్య నటించిన 'కంగువా' అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 2025లోనే కాకుండా కోలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ అతి పెద్ద డిజాస్టర్ జాబితాలో చేరింది. కంగువా సినిమా డిజాస్టర్‌కి కారణం ఏంటంటూ కొందరు పోస్ట్‌మార్టం చేస్తూ సంగీతం ఒక కారణంగా చెప్పుకొచ్చారు. కంగువా సినిమాలోని బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ విషయంలో మొదటి నుంచి కొందరు విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఒక్కసారిగా సౌండ్ పెరగడం, తగ్గడం జరిగింది. అది దేవిశ్రీ ప్రసాద్ తప్పు అంటూ కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం సాంకేతిక సమస్యల కారణంగా అలా జరిగిందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

కంగువా నిర్మాత జ్ఞానవేల్‌ రాజా స్వయంగా మాట్లాడుతూ సౌండ్‌ సమస్యకు కారణం దేవి శ్రీ ప్రసాద్‌ కాదు అని, సాంకేతిక సమస్యల కారణంగా అలా జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే సౌండ్ ఇంజనీర్ రసూల్‌ మాత్రం ఇండైరెక్ట్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశాడు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ సరిగా లేకపోవడం వల్లే సౌండ్‌ సమస్య వచ్చింది అన్నట్లుగా రసూల్‌ చెప్పుకొచ్చింది. ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, తమిళ సోషల్‌ మీడియా వర్గాల వారు దేవిశ్రీ ప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కంగువా సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌ కనబర్చిన అశ్రద్ద కారణంగానే ఈ దారుణం జరిగిందని కొందరు డైరెక్ట్ ఎటాక్ చేశారు.

మీడియాలో పెద్ద ఎత్తున దేవి శ్రీ ప్రసాద్‌ పై విమర్శలు వచ్చాయి. అయినా ఇప్పటి వరకు దేవి శ్రీ ప్రసాద్‌ స్పందించలేదు. ఆయన అభిమానులు మాత్రం విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు. ఎట్టకేలకు కంగువా సౌండ్‌ విషయంలో వచ్చిన విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్‌ స్పందించాడు. తనపై విమర్శలు చేసిన వారి గురించి అసలు పట్టించుకోను అన్నాడు. మనం చేసే ప్రతి పనిని విమర్శించే వారు చాలా మంది ఉంటారు. ఏ ఒక్క విషయంలోనూ ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉంటుందని నేను అనుకోవడం లేదు. కనుక తాను కంగువా గురించి వస్తున్న విమర్శలను పట్టించుకోలేదు. అయితే కంగువాకి వచ్చిన ప్రశంసలు నాకు చాలా స్పెషల్‌ అన్నారు.

నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కంగువా సినిమా ఆల్బంకి చాలా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మన్నిప్పు పాట చాలా బాగుందని ఎంతో మంది చెప్పారు. ఆ పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట. ఆ పాటను విడుదల చేసిన సమయంలో సూర్య అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు. సినిమాలోనూ పాటకి మంచి స్పందన వచ్చింది. సినిమాలోని మ్యూజిక్ గురించి హీరో సూర్య నాతో దాదాపు 30 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. ఆయన ప్రోత్సాహం, ఆయన మద్దతు ముందు ఇతరులు చేసిన విమర్శలను తాను పెద్దగా పట్టించుకోలేదు. ముందు ముందు సూర్యతో కలిసి వర్క్‌ చేయాలని ఎదురు చూస్తున్నామని దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News