సీఎం రేవంత్ రెడ్డికి రాక్ స్టార్ ఆహ్వానం!

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో క‌లిసి ఆహ్వానించారు.

Update: 2024-10-16 09:28 GMT

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ తొలిసారి హైద‌రాబాద్ లో లైవ్ కన్స‌ర్ట్ నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 19 గ‌చ్చిబౌలి స్టేడియంలో ఈ క‌న్స‌ర్ట్ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే దేవి శ్రీ అండ్ కో ఆ ప‌నుల్లో బిజీగా ఉంది. తాజాగా టాలీవుడ్ నుంచి కొంత మంది అతిధుల్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో క‌లిసి ఆహ్వానించారు.

ఆయ‌న‌తో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డికి రాక్ స్టార్ ఓ గిటార్ ని అందించారు. త‌న మ్యూజిక్ ఇండికేష‌న్ గా ఇలా చేసారు. ఈ స‌మ‌యంలో దేవి శ్రీతో పాటు నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా వెంట ఉన్నారు. హైద‌రాబాద్ లో మొద‌లు పెట్టి వివిధ రాష్ట్రాల్లో ఈ క‌న్స‌ర్ట్ కండక్ట్ చేస్తారు. మొద‌ట‌గా హైద‌రాబాద్ ని దేవి శ్రీ వేదిక‌గా చేసుకున్నారు.

19 ఈవెంట్ త‌ర్వాత త‌దుప‌రి క‌న్స‌ర్ట్ గురించి క్లారిటీ వ‌స్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే దేవి శ్రీ ప్ర‌సాద్ ఇలా ఈవెంట్లు మొద‌లు పెడుతున్నారు. `పుష్ప` సినిమాకు గానూ ఏకంగా జాతీయ స్థాయిలోనే ఆయ‌న‌కు పేరొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ సంగీత ద‌ర్శ‌కుడిగా చాలా సినిమాల‌కు ప‌నిచేసారు. ప్ర‌స్తుతం లైన‌ప్ లోనూ చాలా సినిమాలున్నాయి.

`పుష్ప‌-2 `కి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఆర్సీ 17 కూడా అత‌నే బాణీలు క‌ట్టారు. కుభేర, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, థండేల్ చిత్రాల‌కు రాక్ స్టార‌నే మ్యూజిక్ స‌మ‌కూర్చుతున్నారు. అయితే మునుప‌టి కంటే అవ‌కాశాలు త‌గ్గాయి. కొత్త సంగీత దర్శ‌కులు రావ‌డంతో? మేక‌ర్స్ కొత్త వాళ్ల‌తోనూ ముందుకెళ్తున్నారు.

Tags:    

Similar News