ట్రైలర్ టాక్: ధక్ ధక్ రైడ్ టఫ్ గురూ!
తాప్సీ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. హిందీ పరిశ్రమకి వెళ్లినప్పటి నుంచి అమ్మడు మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది లేదు
తాప్సీ కెరీర్ బాలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. హిందీ పరిశ్రమకి వెళ్లినప్పటి నుంచి అమ్మడు మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది లేదు. ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టి పనిచేస్తుంది. ఎదుగుదలంతా అక్కడే ఉందని జర్నీ సాగిస్తుంది. అయితే ఇప్పటివరకూ అమ్మడి కెరీర్ బ్రేకింగ్ హిట్ అంటూ ఒకటీ పడలేదు. చేతిలో సినిమాలైతే కనిపిస్తున్నాయి గానీ..సరైన హిట్ పడి తాప్సీ పేరు మ్రోగిన సన్నివేశం ఇంతవరకూ కనిపించలేదు.
అలాగే అమ్మడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అక్కడా బిజీగానే ఉంది. తాప్సీ నిర్మిస్తోన్నతాజా ప్రాజెక్ట్ `ధక్ ధక్`. దీనికి తరుణ్ దుడేజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇదొక రోడ్ ట్రిప్ జర్నీ.
ఇది మహిళల రహదారి ప్రయాణం. ఢిల్లీ నుండి హిమాలయాల్లోని ఖర్దుంగ్లా వరకు బైక్ ట్రిప్ ఎలా సాగింది? అన్నది ట్రైలర్ రివీల్ చేసారు. రోడ్ జర్నీలో ఎదురయ్యే సవాళ్లు...కఠినమైన దారుల్లో ప్రయాణం ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మలిచారు. వివిధ రంగాలకు చెందిన నలుగురు సాధారణ మహిళల చుట్టూ ఈ కథ తిరుగుతంది. ఈ రైడ్ ని ఎలా సాగిందన్నది? అన్నది ఆసక్తికరం.
ఇందులో ఫాతిమా సనా షేక్ స్కై అనే నిర్భయ ట్రావెల్ బ్లాగర్ పాత్రలో కనిపిస్తుంది. మహి అనే పాత్రలో రత్న పాఠక్ షా పోషించిన పాత్ర ఇంట్రెస్టింగ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి అయిన ఉమ్లింగ్ లా ద్వారా లేహ్ లడఖ్‌కు బైక్ రైడ్ ఎలా ఉంటుందన్నది ఆమె ముందుగానే రివీల్ చేస్తుంటారు. ఇంకా దియా మీర్జా.. సంజన సంఘ్వీ కీలక పాత్రలు ఆసక్తికరం. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటీటీకి వెళ్లకుండా నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నారు.