పుట్టింటికి వెళ్లిపోయిన ధనశ్రీ మమ్మీతో ఇలా ప్రత్యక్షం
ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి ధనశ్రీ వర్మ విడిపోయారనే పుకార్లు షికార్ చేస్తున్నాయి.
ప్రముఖ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి ధనశ్రీ వర్మ విడిపోయారనే పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లను ఆ ఇద్దరూ ఖండించకుండానే `కొన్నిటికి కాలమే సమాధానం చెబుతంది`` అన్న ధోరణిని అనుసరిస్తున్నారు. తమ మధ్య ఏం జరుగుతోందో తెలియకుండా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆ ఇద్దరూ ఇప్పటికే ఆవేదనను వ్యక్తం చేసారు.
ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో బ్రేకప్ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ధనశ్రీతో కలిసి ఉన్న అన్ని పోస్ట్‌లను యుజ్వేంద్ర చాహల్ తొలగించడంతో విడిపోయే అవకాశం ఉందనే పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే ఈ జంట దీనిపై నేరుగా వ్యాఖ్యానించకుండా క్రిప్టిక్ పోస్టులను ఆశ్రయించారు.
తాజాగా ధనశ్రీ సోషల్ మీడియాల్లో హత్తుకునే ఫోటోని పోస్ట్ చేసింది. ధనశ్రీ తన తల్లి భుజంపై తలను ఆన్చి ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపిస్తోంది. నీలిరంగు స్వెటర్ ధరించి.. తన మేకప్‌ను సహజంగా ఉంచుకుంది. కష్టకాలంలో తన తల్లి నుంచి అన్ని విధాలా తనకు భరోసా ఉందనే కాన్ఫిడెన్స్ కనిపించింది. బాల్కనీ దగ్గర నిలబడి ఉన్న తన తల్లితో కలిసి ధనశ్రీ ఎలాంటి టెన్షన్లు లేకుండా రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. ఈ కష్టకాలంలో కుమార్తెకు అండగా నిలిచిన తల్లిపైనా నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధనశ్రీ తన పుట్టింటికి వెళ్లిపోయింది.. ఇదిగో ఇదే ప్రూఫ్ అని కొందరు వ్యాఖ్యానించగా, ప్రస్తుతానికి పర్సనల్ లైఫ్ పై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కొందరు సూచించారు.