నయనతారపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ధనుష్!

అయితే అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్ ఉపయోగించారంటూ నయనతారపై ధనుష్‌ తాజాగా పిటిషన్ ఫైల్ చేశారు.

Update: 2024-11-27 08:40 GMT

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ విషయంలో సౌత్ హీరో హీరోయిన్లు ధనుష్ - నయనతారల మధ్య నెలకొన్న వివాదం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమాకి సంబంధించిన విజువల్స్‌ వాడుకోడానికి నిర్మాత ధనుష్ ఎన్ఓసీ ఇవ్వలేదంటూ నయన్ తీవ్రమైన విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్ ఉపయోగించారంటూ నయనతారపై ధనుష్‌ తాజాగా పిటిషన్ ఫైల్ చేశారు.

'నానుమ్ రౌడీ ధాన్' సినిమా విజువల్స్ ను తన పర్మిషన్‌ లేకుండా నెట్ ఫ్లిక్స్ 'బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' డాక్యుమెంటరీలో వాడుకున్నారని వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తరపున ధనుష్ బుధవారం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌ లపై పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది.

విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై "నేనూ రౌడీ నే" చిత్రాన్ని నిర్మించారు ధనుష్. ఈ సినిమా షూటింగులోనే నయన్, విఘ్నేష్ ప్రేమించుకున్నారు. కొన్నేళ్లు డేటింగ్ చేసి పెళ్ళి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టారు. తమ లైఫ్ లో ఎంతో ప్రత్యేకమైన 'నేనూ రౌడీ నే' సినిమా పాటలు ఫోటోలను తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఉపయోగించాలని నయన్ దంపతులు భావించారు. అయితే దీనికి ధనుష్ అనుమతి నిరాకరించాడని, కావాలనే రెండేళ్లు తిప్పుకొని ఎన్ఓసీ ఇవ్వలేదని ఆరోపిస్తూ నయనతార ఓపెన్ లెటర్ రాసింది.

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ ట్రైలర్ లో 3 సెకండ్ల 'నానుమ్ రౌడీ ధాన్' బీటీఎస్ వీడియో క్లిప్ పెట్టినందుకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ధనుష్ లీగల్ నోటీస్ పంపినట్లు నయన్ తెలిపింది. ఈ క్రమంలో ధనుష్ క్యారక్టర్ ను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై ధనుష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే నయనతార బర్త్ డే స్పెషల్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఆమె డాక్యుమెంటరీలో 30 సెకండ్లకు పైగా 'నానుమ్ రౌడీ ధాన్' విజువల్స్ వాడినట్లు తెలుస్తోంది. దీన్ని లీగల్ గానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్న ధనుష్.. తాజాగా నయనతార దంపతులపై కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News