డబ్బు తీసుకుని డేట్స్ ఇవ్వలేదంటూ హీరోపై నిర్మాణ సంస్థ ఫైర్
ఓ వైపు నటుడిగా, మరోవైపు డైరెక్టర్ గా ఇంకోవైపు నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.;

ఓ వైపు నటుడిగా, మరోవైపు డైరెక్టర్ గా ఇంకోవైపు నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇడ్లీ కడై. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందని మేకర్స్ చెప్పారు. కానీ ఇప్పుడు అనుకోకుండా సినిమా వాయిదా పడింది. ఇడ్లీ కడై మూవీలోని కొన్ని సీన్స్ విదేశాల్లో షూట్ చేయాల్సొస్తుందని, అందుకే సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్‌కు చెందిన ఆకాష్ భాస్కన్ వెల్లడించారు.
ధనుష్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. కాకపోతే ఏప్రిల్ 10న వస్తుందనుకున్న సినిమా ఇప్పుడు వాయిదా పడటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, నిత్యా మీనన్, రాజ్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇడ్లీ కడై చేస్తూనే ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే పాన్ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నాడు. నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బిచ్చగాడు అపర కుబేరుడు ఎలా అయ్యాడనే నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా ప్రతీ ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుందని ఫిల్మ్ నగర్ లో ఆల్రెడీ టాక్ ఉంది.
ఇడ్లీ కడై, కుబేరతో పాటూ ధనుష్ బాలీవుడ్ లో ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మైన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఫైవ్ స్టార్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ధనుష్ గతేడాది సెప్టెంబర్ 6న డబ్బులు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు తమకు కాల్షీట్స్ ఇవ్వలేదని, దాని వల్ల తామెంతో బాధ పడుతున్నామని ఫైవ్ స్టార్స్ సంస్థ షేర్ హోల్డర్ కలై సెల్వి ఓ లేఖను రిలీజ్ చేస్తూ ధనుష్ పై సంచలన ఆరోణలు చేశారు.
ఇడ్లీ కడై షూటింగ్ ఆగకుండా పూర్తి చేయాలని డాన్ పిక్చర్స్ ఆకాష్ అన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 30 నాటికి తమకు డేట్స్ కేటాయిస్తారని చెప్పారని, కానీ ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని కలై సెల్వి ఆ లెటర్ లో పేర్కొన్నారు. తమకు న్యాయం అందించే సంఘాలే లేవా అంటూ ప్రశ్నిస్తున్న కలై సెల్వి, వడ్డీకి డబ్బులు తీసుకుని నిర్మాతలు సినిమాలు చేస్తారని, వారి బాధ మీకెప్పుడు తెలుస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తమకు న్యాయం జరగాలని కోరారు. ధనుష్ పై ఆరోపణలు చేస్తూ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సంస్థ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.