టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌పై కన్నేసిన ధనుష్?
సూర్య తరహాలో తమిళ స్టార్ ధనుష్ కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు.;

ఏ ఇండస్ట్రీలో విన్నా టాలీవుడ్ మాటే ప్రధానంగా వినిపిస్తోంది. `బాహుబలి` తరువాత మన నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తుండటం..భారీ విజయాల్ని సొంతం చేసుకుంటూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుండటంతో కోలీవుడ్ టు హాలీవుడ్ వరకు టాలీవుడ్ సినిమాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, హీరోల దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఈ వరుసలో బాలీవుడ్ స్టార్స్ మన సినిమాల్లో నటించడానికి పోటీపడుతున్నారు.
ఇదే తరహాలో కోలీవుడ్ స్టార్స్ కూడా మన డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుండగా అదే తరహాలో తమిళ క్రేజీ హీరో సూర్య కూడా తెలుగు డైరెక్టర్‌తో కలిసి పని చేయనున్న విషయం తెలిసిందే. లక్కీ భాస్కర్‌తో సక్సెస్‌ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరితో కలిసి త్వరలో సూర్య ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు.
సూర్య తరహాలో తమిళ స్టార్ ధనుష్ కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో `సార్`, ప్రస్తుతం శేఖర్ కమ్ములతో `కుబేర` మూవీలో నటిస్తున్నాడు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 20న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రెండు ప్రాజెక్ట్‌లతో తెలుగు డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్ నచ్చిన ధనుష్ ఈసారి భారీ ప్రాజెక్ట్‌ని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో చేయాలని భావిస్తున్నాడని తెలిసింది.
త్వరలో అల్లు అర్జున్‌తో మైథలాజికల్ మూవీని తెరపైకి తీసుకురానున్న త్రివిక్రమ్ దీనితో పాటు ధనుష్ మూవీని కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయని ఇన్ సైడ్ టాక్. ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో `ఇడ్లీ కడై` మూవీని రూపొందిస్తున్నాడు. నిత్యామీనన్, షాలిని పాండే హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది.