ఆ ఇష్యూ దెబ్బకొట్టిందా.. సీన్ రివర్స్ కు రీజన్ అదేనా..?
అయితే కోలీవుడ్ హిట్ మిషన్ లా భావించే వారు మాత్రం నయనతారతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈమధ్య తరచు వార్తల్లో ఉంటుంది. అంతకుముందు సినిమాల్లో తప్ప బయట ఎక్కువ కనిపించని అమ్మడు సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించకుండా ఉంటుంది. సినిమా షూటింగ్ లో పాల్గొనేంతవరకే తన బాధ్యత ప్రమోషన్స్ గట్రా తన వల్ల కాదని అమ్మడు ముందే చెప్పేస్తుంది. దాని ప్రకారంగానే అగ్రిమెంట్ కూడా రాసుకుంటారు. నయన్ ఇలాంటి కండీషన్స్ పెట్టడం వల్లే కొంతమంది నిర్మాతలకు ఆమె దూరం అవుతుంది. అయితే కోలీవుడ్ హిట్ మిషన్ లా భావించే వారు మాత్రం నయనతారతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటారు.
ఇదిలా ఉంటే నయనతార గురించి ఈమధ్యనే ఒక డాక్యుమెంటరీ రిలీజైంది. ఇందులో నయన్ కెరీర్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు విఘ్నేష్ తో తన పెళ్లి వేడుక కూడా ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీ కోసమే ధనుష్ నుంచి ఎన్.ఓ.సీ అడిగితే అది ఇవ్వకుండా ఆమెకు 10 కోట్ల దాకా దావా వేయాలని ధనుష్ ఫిక్స్ అయ్యాడనే ఆమె ధనుష్ గురించి ఓపెన్ లెటర్ రాసి వ్యవహారం బయట పెట్టింది.
ఈ ఇష్యూపై ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే ఈ ఇంపాక్ట్ వల్ల ఇంకా ఎక్కువ చూసేస్తారు అనుకున్న నయనతార డాక్యుమెంటరీని చాలామంది ఎవైడ్ చేస్తున్నారు. ధనుష్ ఇష్యూ వల్ల డాక్యుమెంటరీకి మేలు జరుగుతుందని అనుకోగా అది కాస్త నెగిటివ్ అయిపోయింది. ఈ వ్యవహారం పట్ల ఇద్దరి తరపున వాధిస్తున్న వారు ఉన్నారు.
ఐతే లేటెస్ట్ గా ధనుష్, నయనతార ఇద్దరు ఎదురెదురు పడినా మాట్లాడుకోలేదు. చెన్నైలో నిర్మాత ఆకాష్ భాస్కర్ పెళ్లిలో ధనుష్, నయనతార ఇద్దరు అటెండ్ అయ్యారు. ఇద్దరు కొద్దిదూరంలో ఒకరికి మరొకరు కనిపించేలా సీట్లలో కూర్చున్నా కూడా ఎవరికి వారు పట్టనట్టుగా ఉన్నారు. ఐతే మిగతా విషయాలేమో కానీ ధనుష్ పై స్ట్రైట్ యుద్ధాన్ని ప్రకటించేలా నయన్ ఓపెన్ లెటర్ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఎఫెక్ట్ డాక్యుమెంటరీ మీద ఎంత పడుతుంది అన్నది ఆలోచించలేదు కానీ కచ్చితంగా నయనతార డాక్యుమెంటరీ మీద మాత్రం ధనుష్ ఇంపాక్ట్ ఉన్నదని తెలుస్తుంది.
నయనతార తన డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అవుతుందని ఊహించగా.. దానికి వస్తున్న పూర్ రెస్పాన్స్ చూసి షాక్ అవుతుంది. ధనుష్ ఇష్యూ వల్ల అని కాదు కానీ నయన్ డాక్యుమెంటరీ పై ఎందుకో ప్రేక్షకులు అంత ఆసక్తి కనబరచలేదు. కోలీవుడ్ ఆడియన్స్ ఏమో కానీ తెలుగు వాళ్లు మాత్రం ఈ డాక్యుమెంటరీని అసలు పట్టించుకోలేదని చెప్పొచ్చు.