ధనుష్-సూర్యతో వెంకీ అట్లూరీ పాన్ ఇండియా!
ఇద్దరి కలయికలో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది.
సౌత్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా చిత్రాల హవా విస్తృతమవుతోన్న సంగతి తెలిసిందే. సోలో ప్రయత్నాలు కొన్నైతే...మల్టీస్టారర్ రూపంలో మరికొన్ని ముస్తాబవుతున్నాయి. తాజాగా ఈ వరల్డ్ లోకి ధనుష్-సూర్య కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి కలయికలో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది. ధనుష్ కి ఇప్పటికే బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది.
అక్కడ సోలోగా హిందీ చిత్రాలు చేసిన అనుభవం ఉంది. యూత్ పుల్ ఎంటర్ టైనర్ లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సూర్య సౌత్ లో సూపర్ స్టార్. హిందీ మార్కెట్ పెద్దగా లేదు కానీ సౌత్ పరంగా వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు. ఇటీవలే పాన్ ఇండియాలో కంగువ చేసాడు. కానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్ భాగస్వామ్యంలో సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వినిపిస్తోంది. అదే జరిగితే ధనుష్-సూర్య సంచలమవ్వడం ఖాయం.
దర్శకుడిగా వెంకీ అట్లూరికి తిరుగు లేదు. `తొలి ప్రేమ`, `సార్`, `లక్కీ భాస్కర్` లాంటి క్లాసిక్ హిట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ మూడు 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలే. `సార్` తో ధనుష్ ని డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. రైటర్ గా అతడి స్టాండర్స్ ఎలా ఉంటాయన్నది ధనుష్ మంచి ఐడియా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మల్టీస్టారర్ స్టోరీతో ధనుష్ ని అప్రోచ్ అవ్వడంతో పాజిటివ్ గా స్పందించినట్లు కనిపిస్తుంది.
అయితే ఈ చిత్రానికి `హానెస్ట్ రాజ్` అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ఇది పరిశీలనలో ఉన్న టైటిల్ గా కనిపిస్తుంది. సూర్యకిప్పుడు తెలుగు డైరెక్టర్ నుంచి సక్సెస్ కూడా అంతే అవసరం. చాలా కాలంగా అతడు టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ సరైన టైమ్ రాకపోవడంతో కుదరలేదు. ఇప్పుడు ధనుష్- వెంకీ రూపంలో ఓ ప్రాజెక్ట్ ముందుకెళ్లడంతో ఒకె చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.