బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు… రాయన్ మూవీ ట్రైలర్

ఇదిలా ఉంటే తాజాగా రాయన్ మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ మాస్ ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్ తో చాలా పవర్ ఫుల్ గా ఉంది.

Update: 2024-07-16 15:24 GMT

ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ రాయన్. 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సిద్ధం చేస్తున్నారు. జులై 26న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. అలాగే ధనుష్ ప్రతినాయకుడిగా నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళీ, ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ ఇంటరెస్టింగ్ రోల్స్ లో ని ఈ చిత్రంలో చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా రాయన్ మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ మాస్ ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్ తో చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా రాయన్ మూవీలో కాన్సెప్ట్ ని పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో రాయన్ కి ఓ వ్యక్తి కథ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. రాయన్ అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏంటో తెలుసా అని అడుగుతాడు. దానికి సింహం అని చైల్డ్ యాక్టర్ గా ఉన్న రాయన్ చెబుతాడు…

అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే.. కానీ ప్రమాదకరమైన జంతువు తోడేలు ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది… కానీ తోడేలు చాలా జిత్తులమారిది… గుంపుగా కలిసి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి అని కథని నేరేట్ చేస్తూ ఉంటే తోడేల గుంపులు లాంటి ప్రతినాయకులుగా ప్రకాష్ రాజ్, ఎస్.జె.సూర్యతో పాటు మరికొన్ని క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు.

తరువాత ఎస్.జె.సూర్య హీరోని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ని ఎలివేట్ చేశారు. నెక్స్ట్ సెల్వ రాఘవన్ ధను క్యారెక్టర్ ని ఉద్దేశించి వస్తాడు… బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు… దహనం చేస్తాడు అంటూ డైలాగ్ చెబుతూ ఉంటే అతని క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ లో ఎలివేట్ చేశారు. ఈ డైలాగ్, ఎలివేషన్ షాట్స్ కి తగ్గట్లుగా రెహమాన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.

ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే హైవోల్టేజ్ యాక్షన్ కథాంశం తోనే రాయన్ మూవీ ఉండబోతోందని అర్ధమవుతోంది. రౌడీయిజం, రాజకీయంతో ఆధిపత్యం చేసే వారికి ఎదురెళ్ళే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రాయన్ గా ధనుష్ కనిపిస్తున్నాడు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మూవీ ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ క్రియేట్ చేసేలా ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని, బిజినెస్ కూడా సాలిడ్ గా జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Full View
Tags:    

Similar News