మేనల్లుడి కోసం మెగా ఫోన్ పడుతున్న స్టార్ హీరో..!
ధనుష్ దర్శక నిర్మాతగా ఈ సినిమా వస్తుందని టాక్. అంటే మేనల్లుడి కోసం ధనుష్ మరోసారి దర్శకత్వ బాధ్యత తీసుకుంటున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈమధ్య కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ లో ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమాలో ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ధనుష్ తన మేనల్లుడి కెరీర్ బాధ్యత కూడా తన మీద వేసుకున్నట్టు తెలుస్తుంది. ధనుష్ కి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ధనుష్ మేనల్లుడు తెరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అయితే మేనల్లుడు సినిమాకు అన్నీ తానై చూసుకుంటున్నాడు ధనుష్.
ధనుష్ దర్శక నిర్మాతగా ఈ సినిమా వస్తుందని టాక్. అంటే మేనల్లుడి కోసం ధనుష్ మరోసారి దర్శకత్వ బాధ్యత తీసుకుంటున్నాడు. ఆల్రెడీ తను చేస్తున్న రాయన్ కు పనిచేసే టీమే తన మేనల్లుడి సినిమాకు పనిచేస్తుందని తెలుస్తుంది. ధనుష్ డైరెక్షన్ లో ఎంట్రీ అంటే తప్పకుండా మేనల్లుడికి మంచి బ్రేక్ దొరికినట్టే లెక్క.
ఓ పక్క సినిమాల్లో నటిస్తూ డైరెక్షన్ కూడా అదే టైం లో చేయడం అనేది చాలా కష్టం. కానీ ధనుష్ అది చాలా సునాయాసంగా చేస్తున్నాడు. ముఖ్యంగా మేనల్లుడి కోసం ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారట ధనుష్. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ రావాల్సి ఉంది. ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాతో పాటుగా రాయన్ సినిమాను కూడా పూర్తి చేసి మేనల్లుడి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.
తమిళ హీరోనే అయినా కూడా ధనుష్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో మంచి హిట్ గా నిలిచింది. లాస్ట్ ఇయర్ వచ్చిన సార్ కూడా సక్సెస్ అయ్యింది. చిన్నగా తమిళంతో పాటుగా తెలుగు మార్కెట్ మీద కూడా పట్టు సాధిస్తున్నారు ధనుష్. రాబోతున్న సినిమాలు కూడా తెలుగు, తమిళ్ రెండు చోట్ల భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.