తెలుగు స్టేట్స్ లో వరదలు.. ధూం ధాం వాయిదా..

ఇప్పటికే ధూం ధాం సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. మంచి రెస్పాన్స్ అందుకుంది.

Update: 2024-09-09 16:24 GMT

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధూం ధాం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్న ఆ సినిమాను ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ రూపొందిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ అండ్ పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.


ఇప్పటికే ధూం ధాం సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. గోపీసుందర్ స్వరపరిచిన సాంగ్స్.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..', 'టమాటో బుగ్గల పిల్ల..', 'కుందనాల బొమ్మ..', 'మనసున మనసు నువ్వే..' చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. అయితే ఇటీవల ధూం ధాం మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 13వ తేదీన ధూం ధాం మూవీని రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి విదితమే. దీంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మూవీని రిలీజ్ చేయాలని సరికాదని భావించినట్లు మేకర్స్ తాజాగా తెలిపారు.

అందుకే ధూం ధాం సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. అయితే ధూం ధాం ట్రైలర్ రిలీజ్ సమయంలో డైరెక్టర్ శ్రీను వైట్ల ప్రశంసలు కురిపించారు. తన వద్ద ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కు రచయితగా గోపీ మోహన్ పనిచేశారని గుర్తు చేశారు. ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే మూవీకి బిగ్ అసెట్ గా మారిందని శ్రీను వైట్ల కొనియాడారు.

అదే సమయంలో నిర్మాత రామ్ కుమార్.. మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అని హీరో గోపీచంద్ కొనియాడారు. గోపీ మోహన్ మంచి స్టోరీ ఇచ్చారని చెప్పారు. ట్రైలర్ ద్వారా అది అర్థమైందని పేర్కొన్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని తెలిపారు. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్నారు. మరి ధూం ధాం మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News