స్టార్ హీరో వారసుడు టాలీవుడ్ ప్రయత్నాలా?
చియాన్ విక్రమ్ వారసుడు దృవ్ విక్రమ్ `అర్జున్ రెడ్డి` రీమేక్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. `ఆదిత్య వర్మ` టైటిల్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు.
చియాన్ విక్రమ్ వారసుడు దృవ్ విక్రమ్ `అర్జున్ రెడ్డి` రీమేక్ తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిం దే. `ఆదిత్య వర్మ` టైటిల్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. కానీ ధృవ్ కిది బెస్ట్ లాంచింగ్ మూవీ కాలేక పోయింది. ముందుగా బాల టేకప్ చేయడం..అటుపై ఆయన తప్పుకోవడంతో గిరీశయ్య తెరపైకి రావడం ఇలా కొంత గందరగోళం మధ్య డెబ్యూ ఫలితం అనుకున్న విధంగా రాలేదు.
అటు పై ధృవ్ `వర్మ`, `మహాన్` లాంటి చిత్రాలు చేసాడు. మహాన్ యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత మారి సెల్వన్ దర్శకత్వంలో `బిసన్` లో నటించాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సెట్స్ కి వెళ్లి చాలా కాలమవుతుంది. కానీ ఇంతవరకూ రిలీజ్ కి నోచుకోలేదు.ఇది గాక చేతిలో కొత్త ప్రాజెక్ట్ లు ఏవైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఇలా స్టార్ హీరో కుమారుడి కోలీవుడ్ కెరీర్ నత్త నడకన సాగుతుంది.
ఈ నేపథ్యంలో ధృవ్ తెలుగులో పరిచయం అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. `జిల్` ఫేం రాధాకృష్ణతో ధృవ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవలే రాధాకృష్ణ చైన్నైలో ధృవ్ తో సమావేశమైనట్లు వినిపిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ ని కూడా కలిసాడట. అయితే డిస్కషన్ లో విక్రమ్ లేడని...మీట్ కేవలం ధృవ్-రాధాకృష్ణ మధ్య మాత్రమే జరిగిందంటున్నారు.
ఈ నేపథ్యంలో ధృవ్ కి ఏదైనా స్టోరీ వినిపించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కోలీవుడ్ హీరోలు ఇప్పటికే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వాలని తహతహలాడుతున్నారు. తలపతి విజయ్ కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. ధనుష్ , కార్తీ, సూర్య, శివ కార్తికేయన్ లాంటి స్టార్లకు ఇక్కడ ఎలాగూ డిమాండ్ ఉంది. ఈ మధ్య యంగ్ హీరోలు కూడా బాగా ఫేమస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధృవ్ కూడా లాంచింగ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది.