ఆయ‌న‌ ఆ స్టార్ డైరెక్ట‌ర్ ని లాక్ చేస్తే ర‌చ్చ ర‌చ్చే!

అప్ప‌టి నుంచి ఇప్పటివ‌ర‌కూ న‌టుడిగా ఆయ‌న సినిమా చేయ‌లేదు.

Update: 2024-10-15 06:08 GMT

మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి `లాల్ సింగ్ చ‌ద్దా` రూపంలో ఘోర ప‌రాభ‌వం ఎదురైనా సంగ‌తి తెలిసిందే. సినిమా ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఆ సినిమాని బ్యాన్ చేయాలంటూ రిలీజ్ కి ముందు ఓ సెక్ష‌న్ ఇచ్చిన పిలుపుతో అమీర్ ఒక్క‌సారిగా నిర్ఘాంత పోయారు. రిలీజ్ త‌ర్వాత సినిమా బాగోలేదు అనే టాక్ కంటే? రిలీజ్ కి ముందు ఇలాంటి షాక్ త‌గ‌ల‌డంతో అమీర్ కి అది కోలుకోలేని దెబ్బ‌గా మారింది.


అప్ప‌టి నుంచి ఇప్పటివ‌ర‌కూ న‌టుడిగా ఆయ‌న సినిమా చేయ‌లేదు. ఈసారి కొడితే అన్ని ర‌క‌లా నెగిటి విటీలో పోయే కంటెంట్ తోనే రావాల‌ని బ‌లంగా నిర్ణ‌యించుకున్నారు. ఈ గ్యాప్ లో కుమారుడు సినిమా ప‌నుల్లో? నిర్మాత‌గా బిజీ అయ్యారు. ఈ క్ర‌మంలో సౌత్ సంచ‌ల‌నం లోకేష‌న్ క‌న‌గ‌రాజ్ ని రంగంలోకి దింపుతున్నార‌నే ప్ర‌చారం కొన్ని నెల‌లుగా జ‌రుగుతోంది.

చాలా క‌థ‌లు విన్నా? ఏవీ అమీర్ కు న‌చ్చ‌క‌పోగా తుది లోకేష్ క‌న‌గరాజ్ ని లాక్ చేసిన‌ట్లు వార్త లొస్తున్నాయి.ఇటీవల లోకేష్ కనగరాజ్, అమీర్ కి ఓ సూపర్ హీరో లైన్ వినిపించారుట‌. ఐడియా న‌చ్చ‌డంతో దాన్ని డెవ‌లెప్ చేయ‌మ‌ని లోకేష్ ని కోరారుట‌. అయితే ఇది ప‌ట్టాలెక్క‌డానికి ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉందం టున్నారు. 2026 లో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంటుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

అంత వ‌ర‌కూ అమీర్ సినిమా చేసే అవ‌కాశం లేదంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి. ప్ర‌స్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా `కూలీ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గెస్ట్ రోల్ లో అమీర్ ని దించుతున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి అమీర్ కూడా ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌రు. మ‌రి నిజం అమీర్ అవ‌స‌రం ఆ సినిమాకి ఉందా? లేదా? అన్న‌ది తేలాల్సిన అంశం.

Tags:    

Similar News