త్రిష కోసం రాసిన కథ.. ఆ హీరో వద్దకు..

అలా టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు.

Update: 2024-10-20 02:45 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రూటే వేరు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఇంట్రెస్టింగ్ మూవీస్ తో సందడి చేస్తుంటారు. నటించిన ప్రతి మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో కంగువా మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను రీసెంట్ గా కంప్లీట్ చేశారు.


ఇటీవల హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు సూర్య అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై రూపొందుతోన్న ఆ మూవీకి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు ఆర్జే బాలాజీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అనౌన్స్మెంట్ రోజు పోస్టర్ రిలీజ్ చేయగా.. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

రేడియో జాకీగా కెరీర్‌ ను స్టార్ట్ చేసిన బాలాజీ.. ఇండస్ట్రీలో ఆల్ రౌండ్ గా పేరు సంపాదిందుకున్నారు. నటుడు, గాయకుడు, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో డెబ్యూ మూవీ అమ్మోరు తల్లి తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వీట్ల విశేషంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు సూర్య 45.. కూడా అమ్మోరు తల్లి మూవీ కాన్సెప్ట్ తోనే ఉంటుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా కోసం బాలాజీ తొలుత లేడీ ఓరియెంటెడ్ స్టోరీ రాసుకుని సీనియర్ బ్యూటీ త్రిషను సంప్రదించారట. కానీ ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత స్టోరీని కాస్త మార్చి.. సూర్యకు నెరేట్ చేశారని సమాచారం. వైవిధ్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేసే సూర్య.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. దీంతో సినిమాను అనౌన్స్ చేశారట. అమ్మోరు తల్లిలో నయనతార దేవతగా కనిపించినట్లే.. సూర్య కూడా దేవుడిగా కనిపించనున్నారని సమాచారం.

అనౌన్స్మెంట్ పోస్టర్ ను చూస్తుంటే.. మూవీ డివైన్ ఫాంటసీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు.. వైవిధ్యానికి సూర్య కేరాఫ్ అడ్రస్ అని కొనియాడుతున్నారు. ఇది మామూలు నిర్ణయం కాదని చెబుతున్నారు. రిస్కీ అటెంప్ట్ ను ఆయన ధైర్యంగా డీల్ చేస్తారని అంటున్నారు. మరి ఆర్జే బాలాజీ.. సూర్య 45ను ఎలా తెరకెక్కిస్తారో.. సూర్య రోల్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News