ప్ర‌గ్యా జైశ్వాల్ బ్యాక్ టూ బ్యాక్ కార‌ణం ఆయ‌న‌ కాదంట‌!

అంత‌కు ముందు న‌టించిన కొన్ని తెలుగు సినిమాలు వైఫ‌ల్యం చెంద‌డంతో అమ్మ‌డిపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డింది.

Update: 2025-01-03 21:30 GMT

హాట్ బ్యూటీ ప్ర‌గ్యాజైశ్వాల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. తెలుగులో ఇప్ప‌టికే చాలా సినిమాలు చేసింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా న‌ట‌సింహ బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించిన 'అఖండ‌'తో మాత్రం బాగా ఫేమ‌స్ అయింది. తెలుగులో అమ్మ‌డి క్రేజ్ పెర‌గ‌డానికి కార‌ణం బాల‌య్య ఇమేజ్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మ‌డి పాపులారిటీ రెట్టింపు అయింది. కానీ ఇత‌ర బ్యాన‌ర్ల‌లో అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డింది.

అంత‌కు ముందు న‌టించిన కొన్ని తెలుగు సినిమాలు వైఫ‌ల్యం చెంద‌డంతో అమ్మ‌డిపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డింది. అలా అవ‌కాశాల‌కు దూర‌మైంది. మ‌ళ్లీ టాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంటుందంటే కార‌ణం బాల‌య్య అనే ప్ర‌చారం ఉంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా న‌టించిన 'డాకు మ‌హారాజ్' లోనూ న‌టించింది. 'అఖండ తాండ‌వం'లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. అయితే బాల‌య్య కార‌ణంగా అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌నే ప్ర‌శ్న ఆమె ముందుకు వెళ్ల‌డంతో? ఇలా స్పందించింది.

బాల‌య్య మాత్రం త‌న‌కు ఎలాంటి రిఫ‌రెన్స్ లు ఇవ్వ‌లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. ద‌ర్శ‌కుడు బాబి కార‌ణంగానే 'డాకు మ‌హారాజ్' లో ఛాన్స్ వ‌చ్చింద‌ని తెలిపింది. క‌థ‌లే త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తాయి త‌ప్ప తనకు తాను గా వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌నంది. ఇప్ప‌టి వ‌ర‌కూ సాగిన సినిమా ప్ర‌యాణమంతా అలాగే జ‌రిగింద‌ని పేర్కొంది. 'డాకు మ‌హారాజ్' లో త‌న పాత్ర‌ను తెర‌పై చూసుకునేందుకు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాన‌ని తెలిపింది.

'కంచె 'సినిమాతో ప్ర‌గ్యా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే న‌టిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అటుపై 'ఓం న‌మోవెంక‌టేశాయ‌', 'గుంటూరోడు', 'న‌క్ష‌త్రం' స‌హా మరికొన్ని సినిమాల్లో న‌టించింది. అవ‌న్నీ పెద్ద ప్రాజెక్ట్ లే. కానీ వాటి ఫ‌లితాలు ప్ర‌గ్యాని రేసులో వెనుక‌బ‌డేలా చేసాయి. మ‌రి బాల‌య్య సినిమాల‌తోనైనా కెరీర్ స్పీడందుకుంటుందేమో చూడాలి.

Tags:    

Similar News