డబుల్ ఇస్మార్ట్ దెబ్బకు నితిన్ సినిమా కూడా!

ఈ రెండు చిత్రాల తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Update: 2024-09-14 01:30 GMT

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నారు. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీ తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. భీష్మ తర్వాత నితిన్ కి సాలిడ్ హిట్ పడలేదు. దీంతో రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో సక్సెస్ లు అందుకొని తన మార్కెట్ పెంచుకోవాలని నితిన్ భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలని విక్రమ్ కె కుమార్ భావిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ కథ సిద్ధం చేసారంట. విక్రమ్ కె కుమార్, నితిన్ కాంబినేషన్ లో 2012లో ఇష్క్ మూవీ వచ్చింది. ఫ్లాప్ లతో ఉన్న నితిన్ కి ఇష్క్ మంచి సక్సెస్ ఇచ్చి మరల లైన్ లోకి తీసుకొచ్చింది.

అయితే నిరంజన్ రెడ్డి రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ థీయాట్రికల్ రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేశారు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఏకంగా 40 కోట్ల వరకు నష్టం వచ్చిందంట. ఈ నేపథ్యంలో దీంతో ఈ సినిమా నిర్మాణం భారం అవుతుందని డ్రాప్ అయ్యారంట. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని సుధాకర్ చెరుకూరి టేకప్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంట.

సుధాకర్ చెరుకూరి ప్రస్తుతం మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. అలాగే నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో మరో సినిమాని చేస్తున్నారు. నితిన్ ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. మేగ్జిమమ్ 2025లో ఈ సినిమా పట్టాలు ఎక్కొచ్చని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

ఇక డబుల్ ఇస్మార్ట్ నష్టం కారణంగా నిరంజన్ రెడ్డి హనుమాన్ సీక్వెల్ నిర్మణ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారనే ప్రచారం నడుస్తోంది. బడ్జెట్ పరిధి పెరిగిపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని టేకప్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి సాయి ధరమ్ తేజ్ తో చేస్తోన్న మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది.

Tags:    

Similar News