మరక మంచిదే అన్నట్లు వాయిదా కూడా మంచిదేనా!
కానీ ఈ రెండు సినిమాల విషయంలో ఆలస్యం అన్నదే మంచి పనిగా హైలైట్ అవుతోందిప్పుడు.
చాలా సందర్భాల్లో ఆలస్యం అమృతం విషం అంటారు. చేయవలిసిన కార్యాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే అది అనర్దానికి దారి తీస్తుందని అంతా నమ్మే మాట. కానీ ఈ రెండు సినిమాల విషయంలో ఆలస్యం అన్నదే మంచి పనిగా హైలైట్ అవుతోందిప్పుడు. ఇంతకీ ఏంటా కథ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.
కానీ అదే సమయంలో తనయుడు రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' కూడా ఉండటంతో? తండ్రి వెనక్కి తగ్గినట్లు వెలగులోకి వచ్చింది. ఇందులో కొంత వాస్తవం ఉంది. కానీ అసలు సంగతేంటి? అంటే `విశ్వంభర` సోషియా ఫాంటసీ కావడంతో సీజీ వర్క్ ఎక్కువగా ఉంది. ఆ పనులన్నీ కూడా సంక్రాంతికి పూర్తి చేసి రిలీజ్ చేయాలి. అయితే అప్పటికే షూట్ పూర్తయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నా? పూర్తయిన వరకూ పెద్దగా పర్పెక్షన్ రాలేదుట.
దీంతో మళ్లీ అవసరమైన చోట రీవర్క్ కి చేసారుట. నిజంగా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంటే గనుక ఆ పనంతా గందరగోళం, హైరనాగానే జరిగేదని తాజాగా వెలుగులోకి వస్తోంది. సీజీ వర్క్ ఉన్న సినిమాల విషయంలో ఎంత వీలైంత అంత సమయం తీసుకుని కూల్ గా పనిచేయాలి తప్ప కంగారు పనిచేస్తే క్వాలిటీ ప్రోడక్ట్ అందించ లేము అన్నది తెలిసిందే. లక్కీగా గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలోకి రావడంతో? దర్శకుడు వశిష్ట వెనక్కి తగ్గి కూల్గా పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తే మంచిదని భావించి సమ్మర్ కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ధనుష్, నాగార్జున హీరోలగా నటిస్తోన్న 'కుబేర' చిత్రాన్ని కూడా సక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. కానీ కొంత వర్క్ జరిగిన తర్వాత శేఖర్ కమ్ములా ఎందుకు తొందర పడటం అని ఆలోచించుకుని వెనక్కి తగ్గారుట. ఆ తేదీ కాకపోతే మరో తేదీ కూల్ గా రిలీజ్ చేద్దామని నిర్మాతలు కూడా భరోసా ఇవ్వడంతో `కుభేర` కూడా ఎగ్జిట్ అయినట్లు వెలుగులోకి వస్తోంది.
ఇక్కడ మరో విషయం కూడా గుర్తిచాలి. ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేసి టికెట్ ధరలు ఆకాశాన్నంటేలా పెట్టేస్తే విమర్శలు తప్పవు. అలా కాకుండా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తే ఆ రకమైన ఇబ్బంది ఉండదు అన్నది కమ్ములా నిర్మాతల ఆలోచనగా వెలుగులోకి వస్తోంది. మొత్తానికి అప్పుడప్పుడు ఇలా వాయిదా వేయడం కూడా మంచిదేనని అర్దమవుతుంది.