ఎన్నో చెప్పారు.. కానీ చివరకు ధృవ సర్జా 'మార్టిన్' ఇలా!

దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Update: 2024-10-12 16:45 GMT

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ స‌ర్జా లీడ్ రోల్ లో నటించిన మార్టిన్ మూవీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ అర్జున్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఆ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. వాస‌వీ ఎంట‌ర్‌ ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై ఉద‌య్ కె. మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే రిలీజ్ కు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. మార్టిన్ పై మంచి హోప్స్ క్రియేట్ చేసింది. ట్రైలర్ భారీ హైప్ నెలకొల్పింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అర్జున్ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తానే పేపర్ మీద మార్టిన్ మూవీ కథ రాశానని, దాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని వచ్చినా దాని కంటే ఎక్కువగా ఉంటుందన్నారు.

దీంతో మార్టిన్ హిట్ అవుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా.. భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రేక్షకులు , విమర్శకుల నుంచి నెగిటివ్ రివ్యూస్ అందుకుంది. ఏ మాత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. స్టోరీ సరైన రీతిలో లేకపోవడంతో అర్జున్ సర్జాను అనేక మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కథలో కానీ, కథనంలో కానీ బలం లేదని చెబుతున్నారు. మేకింగ్‌ లో హంగులు తప్ప, కథ చెప్పడంలో డైరెక్టర్ అర్జున్ ప్రతిభ కనిపించలేదని అంటున్నారు.

స్టోరీలో క్లారిటీ లేకపోవడంతో సెకండాఫ్ లో మరింత గందరగోళంగా అనిపిస్తుందని చెబుతున్నారు. అయితే సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉందని, కెమెరా పనితనం కట్టి పడేస్తుందని అంటున్నారు. విజువల్స్ ట్రెండీగా అలరిస్తాయని కామెంట్లు పెడుతున్నారు. ప్రొడక్షన్ హైలెవెల్ లో ఉందని, కానీ ప్రతి సీన్ లో కూడా మితిమీరిన ఖర్చు కనిపిస్తుందని చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్స్ కాస్త పర్వాలేదనిపించినా.. ఓవరాల్ గా సినిమాలో కొత్తదనం ఏం లేదని చెబుతున్నారు.

కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ.. రెండు కోణాల్లో సాగే పాత్రలో హీరో ధృవ సర్జా యాక్టింగ్ ఆకట్టుకుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. యాక్షన్ విన్యాసాలు మెప్పిస్తాయని అంటున్నారు. రెండు కోణాల్లో సాగే రోల్ లో ఆయన చేసిన హంగామాతో టైమ్ పాస్ మాత్రమే అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి దసరాకు వచ్చిన సినిమాలు అన్నీ యావరేజ్ గా అనిపించగా.. మార్టిన్ మాత్రం డిజాస్టర్ నిలిచిందని అంటున్నారు.

Tags:    

Similar News