పూజా హెగ్దే పాంచ్ పటాకా.. దెబ్బ అదుర్స్ కదా..!

ఐతే టాలీవుడ్ లో ఛాన్సులు లేకపోయినా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది పూజా హెగ్దే.

Update: 2024-12-20 05:09 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. రాధే శ్యాం ముందు వరకు స్టార్ సినిమా అంటే పూజా పేరు వినిపించేది కానీ ఇప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. పూజా హెగ్దే ని తెలుగు పరిశ్రమ పూర్తిగా దూరం పెట్టింది. దీని వెనక కారణాలు ఏంటన్నది మాత్రం తెలియదు. ఐతే టాలీవుడ్ లో ఛాన్సులు లేకపోయినా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది పూజా హెగ్దే. ప్రస్తుతం అక్కడ షాయిద్ కపూర్ తో దేవా సినిమా చేస్తుంది అమ్మడు. ఈ సినిమా పూర్తి కాకుండానే వరుణ్ ధావన్ సినిమాలో సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ నుంచి కూడా పూజా హెగ్దేకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సూర్య 44 సినిమాలో నటిస్తున్న పూజా బేబ్ ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే దళపతి విజయ్ చివరి సినిమాలో ఛాన్స్ అందుకుంది. విజయ్ తో ఆల్రెడీ బీస్ట్ సినిమా చేసిన పూజా హెగ్దే మరో లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాతో పాటు లేటెస్ట్ గా లారెన్స్ చేస్తున్న కాంచనా సీరీస్ లో కూడా పూజా హెగ్దే ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

పూజా కి తమిళ పరిశ్రమ నుంచి వస్తున్న ఈ ఆఫర్లు కచ్చితంగా ఆమె కెరీర్ ని మళ్లీ సెట్ రైట్ చేసుకునేలా చేస్తుందని చెప్పొచ్చు. మొన్నటిదాకా చేతిలో ఒక్క సినిమా కూడా లేదని పూజా గురించి మాట్లాడిన వారంతా కూడా ఇప్పుడు అమ్మడు చేస్తున్న ఐదు సినిమాల గురించి చెప్పుకుంటున్నారు. పాంచ్ పటాకాతో పూజా మళ్లీ తన కెరీర్ లో జోష్ నింపుకుంది.

పూజా హెగ్దే ఫ్యాన్స్ కి ఈ సినిమాలు తప్పకుండా సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాయని చెప్పొచ్చు. తెలుగులో కెరీర్ ముగిసింది అనుకునేలోగా కాస్త డల్ అయిన అమ్మడు తమిళ్, హిందీ పరిశ్రమల నుంచి వస్తున్న ఆఫర్లతో ఖుషి అవుతుంది. ఈ సినిమాల విషయంలో పూజా హెగ్దే చాలా కాన్ఫిడెంట్ గా ఉందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా మళ్లీ టాప్ లీగ్ లో పూజా హెగ్దే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. తన పని అయిపోయింది అనుకున్న వారందరికీ సమాధానం చెబుతూ పూజా హెగ్దే ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటబోతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News