కంగువా కోసం ప్రభాస్ మాత్రమే కాదు.. ఆ హీరో కూడా..

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Update: 2024-10-17 04:20 GMT

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కంగువా’. ఈసినిమా నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తోంది. 8 భాషలలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. కోలీవుడ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ చిత్రం ఉంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఫిక్షనల్ ఫాంటసీ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ అక్టోబర్ 26న జరగబోతోంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లుగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, డార్లింగ్ ప్రభాస్ హాజరు కాబోతున్నారంట. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. అందుకే డార్లింగ్ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ శివ ‘కంగువా’ కంటే ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘అన్నాత్తై’ మూవీ చేశారు. ఆ అసోసియేషన్ తో రజినీకాంత్ కి ‘కంగువా’ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన కూడా వస్తానని మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే సౌత్ లో రెండు జెనరేషన్స్ ని రిప్రజెంట్ చేసే మోస్ట్ ఐకానిక్ స్టార్స్ ఇద్దరు ఒకే స్టేజ్ పై సందడి చేయబోతున్నారని అర్ధమవుతోంది.

ఇది కచ్చితంగా ‘కంగువా’ మూవీకి మంచి ప్రమోషన్ ఇస్తుందని చెప్పొచ్చు. ‘కంగువా’ సెకండ్ సాంగ్ ని అక్టోబర్ 21న రిలీజ్ చేయబోతున్నారంట. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ తోనే మ్యూజిక్ ఎలా ఉండబోతోందనేది దేవిశ్రీ ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ‘పుష్ప 2’ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో అతని నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ‘కంగువా’ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకుంటుందని అక్కడి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీ లెక్కలు చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మూడు సినిమాలు 1000 కోట్ల మార్క్ ని దాటాయి. హిందీ ఇండస్ట్రీ నుంచి మూడు సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. శాండిల్ వుడ్ నుంచి ఒక సినిమా ఈ క్లబ్ లో చేరింది. కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఈ ఫీట్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. మరి కంగువాతో ఆ రికార్డ్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News