ఆర్సీ 16 లో ప్ర‌గ్యాజైశ్వాల్ కి ఛాన్సా?

కొత్త ఏడాదిని అమ్మ‌డు అలా లాంచ్ చేసింది.

Update: 2025-02-21 01:30 GMT

ముంబై బ్యూటీ ప్ర‌గ్యాజైశ్వాల్ టాలీవుడ్ లో మ‌ళ్లీ బిజీ అవుతోందా? స్టార్ హీరోల చిత్రాల్లోనే అవ‌కాశాలు అందుకుంటుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన 'డాకు మ‌హారాజ్' లో న‌టించింది. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ ర‌కంగా బాల‌య్య అవ‌కాశం ఇవ్వ‌డంతో? మ‌రో స‌క్సెస్ ఖాతాలో న‌మోదైంది. కొత్త ఏడాదిని అమ్మ‌డు అలా లాంచ్ చేసింది.

అటుపై వెంట‌నే అదే బాల‌కృష్ణ తో 'అఖండ‌2' లోనూ ఛాన్స్ అందుకుంది. ఇది పాన్ ఇండియా చిత్రం. బోయపాటి శ్రీను భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఛాన్స్ రావ‌డంతో ప్ర‌గ్యా ఇమేజ్ రెట్టింపు అయింది. అలాగే సాయి శ్రీన‌వాస్ బెల్లంకొండ న‌టిస్తోన్న 'టైస‌న్ నాయుడు'లోనూ న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డికి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కూడా వ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా ఇప్ప‌టికే జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఈనేప‌థ్యంలో ఇదే సినిమాలో ప్ర‌గ్యా జైశ్వాల్ ని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. సినిమాలో ఆ పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని మెగా లీకులందుతున్నాయి. ప్ర‌గ్యా జైశ్వాల్ రోల్ చాలా మాసివ్ గా ఉంటుందిట‌.

తొలుత ఆ పాత్ర కోసం అన‌సూయ‌ని తీసుకోవాల‌నుకున్నారుట‌. కానీ ఆమె ఇప్ప‌టికే 'రంగ‌స్థ‌లం'లో మాస్ రోల్ చేయ‌డంతో? ప్రెష్ నెస్ రాద‌ని భావించి బుచ్చిబాబు ఫాంలో ఉన్న ప్ర‌గ్యా జైశ్వాల్ అయితే బాగుటుంద‌ని అమెని అప్రోచ్ అయిన‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.

Tags:    

Similar News