'పుష్ప 2'.. థమన్ బీజీఎంను పక్కన పెట్టేశారా?
అయితే ఇప్పుడు ఆయన బీజీఎమ్ ను సినిమాలో ఉపయోగించలేదని టాక్ వినిపిస్తోంది.
'పుష్ప 2' మూవీ మ్యూజిక్ గురించి కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే పరిమితం చేస్తున్నారని, బ్యాగ్రౌండ్ స్కోర్ చేయడం లేదని చెప్పుకున్నారు. డీఎస్పీ బీజీఎమ్ తో సంతృప్తి చెందని సుకుమార్ అండ్ అల్లు అర్జున్.. ఎస్.థమన్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారని, థమన్ తో పాటుగా మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద వర్క్ చేస్తున్నారని అన్నారు. ఇదంతా నిజమేనని ఆ మధ్య థమన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన బీజీఎమ్ ను సినిమాలో ఉపయోగించలేదని టాక్ వినిపిస్తోంది.
'పుష్ప 2: ది రూల్' సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద దేవీశ్రీ ప్రసాద్ తో పాటుగా థమన్, సామ్ సిఎస్, అజనీష్ లోక్ నాథ్ వంతు మరో ముగ్గురు సంగీత దర్శకులు వర్క్ చేసారు. థమన్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కు, జాతర ఎపిసోడ్ కి సామ్, మిగతా కొన్ని పోర్షన్స్ కు అజనీష్ బీజీఎం కంపోజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా దేవీశ్రీ, శ్యామ్ సీఎస్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను మాత్రమే వాడినట్లు టాక్ నడుస్తోంది. థమన్, అజనీష్‌లతో రెండు వెర్షన్లు చేయించారు కానీ, అవుట్‌పుట్‌తో సుక్కూ అండ్ టీం సంతృప్తి చెందలేదకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి.
థమన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''పుష్ప-2లో నేను ఒక పార్ట్ మాత్రమే చేశాను. మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా. టూ మచ్ బిజినెస్ ఇన్వాల్వ్ అయ్యింది. నిర్మాతలని దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని విషయాలను మనం ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు కానీ, అదే సమయంలో భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం మొత్తం సినిమాని ఎలా కంప్లీట్ చెయ్యగలం? నేను సినిమా చూసాను. చాలా గొప్పగా ఉంది. కానీ నేను ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను'' అని అన్నారు. తన వర్క్ తో డైరెక్టర్, హీరో ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడేమో తమన్ బీజీఎంతో సంతృప్తి చెందలేదని, అందుకే దేవీశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ నే ఉపయోగించారని అంటున్నారు.
ఇదిలా ఉంటే మొన్న 'పుష్ప 2' ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. క్లైమాక్స్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంమని, నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడని ప్రశంసించారు. మరుసటి రోజు శ్యామ్ సీఎస్ ట్వీట్ చేస్తూ క్లైమాక్స్ కి వర్క్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడేమే తమన్, అజనీష్ లోక్‌నాథ్ ఇద్దరి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని సినిమాలో ఉపయోగించలేదని అంటున్నారు. అసలు ఈ సినిమా ఆర్ఆర్ కోసం ఎవరెవరు వర్క్ చేసారో తెలియదు కానీ, చివరకు ఎవరి బీజీఎమ్ ఉంచారనేది మాత్రం టైటిల్ క్రెడిట్స్ తో తేలిపోతుంది.