ఆ స్టార్ హీరోలిద్దర్నీ వెనక్కి నెట్టిన యంగ్ హీరో!
వాటిని సైతం పక్కకు నెట్టేసి థియేటర్లను హౌస్ పుల్ చేసిందీ చిత్రం.
శివ కార్తికేయన్ నటించిన `అమరన్` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 300 కోట్ల వసూళ్లతో శివ కార్తికేయన్ కెరీర్ లోనే తొలి భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది. ఇదే సినిమాతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటిని సైతం పక్కకు నెట్టేసి థియేటర్లను హౌస్ పుల్ చేసిందీ చిత్రం. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఓ కారణమైతే సినిమాలో సాయి పల్లవి నటించడం మరో బలమైన కారణంగా హైలైట్ అయింది.
లేడీ అభిమానుల్ని థియేటర్ల వరకూ తీసుకు రావడంలో సాయిపల్లవి కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో హాయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా `అమరన్` నిలిచింది. 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం 15 రోజుల్లోనే సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్ రికార్డులను సైతం తునాతునకలు చేసింది. `వేట్టేయాన్` వసూళ్లను రికార్డును కొట్టగా బుకింగ్స్ పరంగా విజయ్ రికార్డులను చెరిపేసింది.
విజయ్ చివరి చిత్రం ` గోట్` బుక్ మై షోలో ఇప్పటి వరకూ టాప్ లో నిలిచింది. 4.5 మిలియన్ టికెట్ సేల్స్ తో టాప్ వన్ లో ఉంది. అయితే `అమరన్` 4.52 మిలియన్ టికెట్ బుకింగ్స్ తో గోట్ రికార్డులను బద్దలు కొట్టేసింది. తమిళనాడులో 2024 లో హాయ్యెస్ట్ బుకింగ్స్ సాధించిన చిత్రంగా అమరన్ నిలిచింది. దీపావళి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ 25 రోజుల థియేటర్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.
స్టిల్ ఇంకా సినిమా చాలా థియేటర్లలో ఆడుతుంది. ఆసక్తిగల అభిమానులు, ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీలను ఇష్టపడే అభిమానులు థియేటర్లో చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శివ కార్తికేయన్ చిత్ర యూనిట్ సభ్యులకు స్వయంగా తన స్వహస్తాలతో వడ్డించి సంతోషం పంచుకున్నాడు.