శోభిత లంచ్ బాక్స్ ఎప్పుడూ వెంటే!
ఎంత 5 స్టార్..7 స్టార్ హోటల్స్ లో తిన్నా? ఇంటిపుడ్ కమ్మదనం ఎక్కడ దొరుకుతుంది.
సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. నిత్యం బిజీ షెడ్యూల్ తో ఉంటారు. ఒకే రోజు రెండు..మూడు షూటింగ్ ల్లో పాల్గొంటారు. ఒక్కోసారి మూడు షిప్టులు పనిచేస్తుంటారు. ఉదయం ముంబైలో ఉంటే? సాయంత్రం చెన్నై, హైదరాబాద్లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంటి పుడ్ కి దూరమవ్వక తప్పదు. హోటల్స్, రెస్టారెంట్లపైనే ఆధారపడుతుంటారు. ఎంత 5 స్టార్..7 స్టార్ హోటల్స్ లో తిన్నా? ఇంటిపుడ్ కమ్మదనం ఎక్కడ దొరుకుతుంది.
అందుకే శోభిత మాత్రం స్ట్రిక్ట్ గా ఇండిపుడ్ నే తీసుకెళ్తుందిట. స్థానికంగా ఉంటే ఇంట్లో నుంచే లంచ్ బాక్స్ తీసుకెళ్తుందిట. బయట ప్రదేశాలకు వెళ్లినా? ఎక్కువ రోజులు షూట్ ఉంటే మాత్రం తన పుడ్ తానే ప్రిపేర్ చేసుకుంటుందిట. వీలైనంత వరకూ లంచ్ బాక్స్ ఎప్పుడూ తన కూడానే ఉంటుందిట. అనవసరమైన పుడ్ తినడం..బయట తినడం వంటి వాటి జోలికి వెళ్లదుట. ఇలా ఉండటం చిన్న విషయం కాదు.
లంచ్ బాక్స్ క్రమం తప్పకుండా తీసుకెళ్లడం అంటే? ఆషామాషీ కాదు. ఓ ప్రణాళిక ఉంటే తప్ప సాధ్య పడదు. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు? శోభిత లా లంచ్ బాక్స్ ఆన్ సెట్స్ కి తీసుకెళ్లే హీరోయిన్లు ఎంత మంది ఉంటారు? నార్త్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లు అంతా పుడ్ విషయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే స్టార్ హీరోలు అప్పుడప్పుడు హీరోయిన్లకు లంచ్ బాక్సులు పంపిస్తుంటారు.
చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో షూటింగ్ ఉందంటే? హీరోయిన్లకు వాళ్ల ఇళ్ల నుంచే లంచ్ బాక్సులు వెళ్తుంటాయి. తమన్నా, కీర్తి సురేష్, శ్రుతిహాసన్, కాజల్ అగర్వాల్ ఇలా స్టార్ భామలంతా తమ హీరోల ఇంట రుచులు చూసిన వారే కదా.