భార్య అనుమానించేలా హీరో చేసిన తప్పు?
ప్రముఖ కథానాయికలతో సదరు హీరో ఎఫైర్ సాగించాడని పలుమార్లు కథనాలొచ్చాయి.
ప్రముఖ దక్షిణాది హీరో ఇటీవలే భార్య నుంచి విడాకులు ప్రకటించాడు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కావడంతో కోర్టులో పని సులువైంది. అయితే ఈ బ్రేకప్ వెనక ఎఫైర్లు అసలు కారణమని చాలా కాలంగా చర్చ సాగుతోంది. ప్రముఖ కథానాయికలతో సదరు హీరో ఎఫైర్ సాగించాడని పలుమార్లు కథనాలొచ్చాయి.
కొన్నేళ్ల క్రితం పాపులర్ కథానాయికతో అతడికి ఎఫైర్ ఉందని సుచీలీక్స్ వెల్లడించింది. సదరు హీరోయిన్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని సెటిలైంది. అంతేకాదు హీరోగారు.. తనతో కలిసి ఓ సినిమాలో నటించిన ప్రముఖ హీరోయిన్‌తోను ఎఫైర్ సాగించాడంటూ కథనాలొచ్చాయి. పాపులర్ రేడియో జాకీతో చాటింగ్ సెషన్ లో అతడు ఆ హీరోయిన్ తో పాటు పాల్గొన్నాడు. కానీ ఇంతలోనే భార్య కూడా వారితో జాయినయ్యేందుకు రావడంతో అతడు సెషన్ నుంచి అర్థాంతరంగా వెళ్లాడు.
ఓ చార్ట్ బస్టర్ ఆల్బమ్ కోసం తన ప్రియురాలితో కలిసి పని చేసాడు. అది హీరో గారి భార్యకు అస్సలు నచ్చలేదు. అలాగే ప్రియురాలితో కలిసి ఓ సినిమా కూడా చేసాడు. ఆ చిత్రం ఫ్లాపైనా కానీ ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్, సాన్నిహిత్యం గురించి చాలా ఎక్కువ చర్చ సాగింది. నిజానికి ఆ ఇద్దరు హీరోయిన్‌లు అతడి జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి చాలా సమస్యలొచ్చాయని కూడా గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా కర్మ సిద్ధాంతం మనిషిని వెంటాడుతుంది. దాని పర్యవసానాన్ని అనుభవించి తీరాల్సిందే. హీరోయిన్ లతో అతడి ప్రవర్తన భార్యను ఇర్రిటేట్ చేసిందన్న గుసగుస కూడా ఉంది.